Vandanam

Vandanam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vandanam, Tourist Information Center, Sri Lakshmi Nagar, Lakshmi Nagar.
(6)

03/09/2022
 అంత్యక్రియలు అప్పుడు కుండలోనీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?    వాస్తవానికి శరీరం ఆత్మ  రెండు వేరు వే...
06/07/2022


అంత్యక్రియలు అప్పుడు కుండలోనీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?

వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.

శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే... కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే.. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.

హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది.

పైన రాసిన స్టోరీ... భగవద్గీత ఆధారంగా రాయబడింది🙏
(సేకరణ)

🙏మార్గశిర శుద్ధ షష్ఠి శ్రీ సుబ్రహ్మణ్య షష్టి🙏🌼ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర...
08/12/2021

🙏మార్గశిర శుద్ధ షష్ఠి శ్రీ సుబ్రహ్మణ్య షష్టి🙏

🌼ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, ఆరుముఖాలుండటం వల్ల షణ్ముఖుడని... ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి.ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.🙏🌼🌿

🌿🌼🙏జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కుజ,రాహు, కేతు దశలు నడుస్తున్నవారు,కుజ దోషం ఉన్నవారు,సంతానంలేని వారు,వివాహం కానివారు,దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారని సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీ, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి,సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సర్ప పూజలు ,తాంత్రిక పూజలు చేసే వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామార్ద్యాలు కలిగి ఉంటారు.🙏🌼🌿

🌿🌼🙏సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మ ణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ సమర్పిస్తారు. బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు. "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది.🙏🌼🌿

శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం...
దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం
స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం...
కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం

🌿🌼🙏ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లయినా మనస్ఫూర్తిగా పఠించితే శత్రు విజయం చేకూరుతుంది.🙏🌼🌿

🌿🌼🙏సుబ్రహ్మణ్య వ్రతకల్పన.. సంతాన ప్రదాతకం🙏🌼🌿

🌿🌼🙏సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణజన్ముడు. తారకాసుర సంహారంకోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెబుతున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. హిరణ్యకశ్యపుని కుమారుడు ‘నీముచి’. ‘నీముచి’ కొడుకు తారకాసురుడు. తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సుచేసి ఆయన ఆత్మ లింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరివల్ల తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. 🙏🌼🌿

🌿🌼🙏తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని శివుడ్ని వేడుకున్నారట. శివుడు వారి కోరికమేరకు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడ్ని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారంకోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరుకూడా వుంది. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు.🙏🌼🌿

🌿🌼🙏సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధనాన్ని ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. 🙏🌼🌿

🌿🌼🙏అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది. 🙏🌼🌿

🌿🌼🙏మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. 🙏🌼🌿

🌿🌼🙏దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది. 🙏🌼🌿

🌿🌼🙏* కాలసర్పదోషం ఉన్నవారికి మేలైనవి:🙏🌼🌿

🌿🌼🙏జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజలవల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. 🙏🌼🌿

🌿🌼🙏అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్ర్తిలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ వుంటాం. సంతానప్రాప్తిని కోరే స్ర్తిలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని అంటారు.🙏🌼🌿

🌿🌼🙏శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి🙏🌼🌿 #శ్రీ_సుబ్రహ్మణ్య_షష్ఠి🙏🌼🌿

🌿🌼🙏దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము!🙏🌼🌿

🌿🌼🙏శ్రీ సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం🙏🌼🌿

🌿🌼🙏పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.
అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.
ఇలా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.
కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. 🙏🌼🌿

🌿🌼🙏అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.🙏🌼🌿

🌿🌼🙏సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని, సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.🙏🌼🌿

🌿🌼🙏ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు, పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.🙏🌼🌿

🌿🌼🙏ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.🙏🌼🌿

🌿🌼🙏ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.🙏🌼🌿

🌿🌼🙏వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించండి. పెళ్ళి కాని వారికి, సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి, సత్సంతానం, వంశాభివృద్ధి, జ్ఞానము, తేజస్సు, పాప కర్మల నుండీ విముక్తి కలుగుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యము.🙏🌼🌿

🌿🌼🙏స్కందోత్పత్తి శ్లోకాలు 🙏🌼🌿

1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా!
సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!!
2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్!
ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!!
3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా!
తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!!
4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా!
సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!!
5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః!
సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!!
6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు!
తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!!
7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశనః!
జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్!!
8. జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్!
ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః!!
9. తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన!
ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్!!
౧౦. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్!
అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః!!
౧౧. దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన!
శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ!!
12. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః!
గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియమ్!!
౧౩. తస్యతద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్!
దృష్ట్వా తన్మహిమానం శ సమంతాదవకీర్యత!!
౧౪. సమంతతస్తదా దేవీం అభ్యషించత పావకః!
సర్వస్రోతా౦సి పూర్ణాని గంగాయా రఘునందన!!
౧౫. తమువాచ తతో గంగా సర్వ దేవా పురోహితం!
అశక్తా ధారణే దేవా తవ తేజస్సముద్ధతం!
దాహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథిత చేతనా!!
౧౬. అథాబ్రవీదిదం గంగం సర్వదేవ హుతాశనః!
ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతామ్!!
౧౭. శ్రుత్వా త్వగ్నివచో గంగా తమ్ గర్భమతి భాస్వరం!
ఉత్ససర్జ మహాతేజః స్రోతోభ్యో హాయ్ తదానఘ!!
౧౮. యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూనదప్రభం!!
౧౯. కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం!
తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత!!
౨౦. మలం తస్యా భవత్ తత్ర త్రపుసీసకమేవ చ!
తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత!!
౨౧. నిక్షిప్తమాత్రే గర్భే టు తేజోభిరభిరంజితం!
సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్!!
౨౨. జాత రూపమితి ఖ్యాతం తదాప్రభ్రుతి రాఘవ!
సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం!
తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం!!
౨౩. త౦ కుమారం తతో జాతం సేంద్రా స్సహమరుద్గణాః!
క్షీరసంభావనార్థాయ కృత్తికా స్సమయోజయన్!!
౨౪. తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం!
దదుః పుత్త్రోయ మస్మాకం సర్వాసామితినిశ్చితాః!!
౨౫. తతస్తు దేవతా స్సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్!
పుత్త్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః!!
౨౬. తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే!
స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్!!
౨౭. స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్!
కార్తికేయ౦ మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్!!
౨౮. ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికా నామనుత్తమమ్!
షన్ణా౦ షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః!!
౨౯. గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తాదా!
అజయత్ స్వేన వీర్యేణ దైత్యసైన్యగణాన్ విభుః!!
౩౦. సురసేనాగణపతిం తతస్తమతులద్యుతిం!
అభ్యషించన్ సురగణాః సమేత్యాగ్ని పురోగమాః!!
31. ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా!
కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ!!
౩౨. భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః!
ఆయుష్మాన్ పుత్త్ర పౌత్త్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్!!
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్త త్రి౦శస్సర్గః!!

* గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు.

🌿🌼🙏అందరం భక్తితో " ఓం శరవణభవ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు🙏🌼🌿

ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ

ఓ కృష్ణా! నువ్వే నాకు తల్లి, తండ్రి. నిరంతరం నన్ను వెంటాడుతూ, నాకు తోడునీడగా ఉండేది నీవే. నీవే నాకు స్నేహితుడివి. నాకు గ...
30/08/2021

ఓ కృష్ణా! నువ్వే నాకు తల్లి, తండ్రి. నిరంతరం నన్ను వెంటాడుతూ, నాకు తోడునీడగా ఉండేది నీవే. నీవే నాకు స్నేహితుడివి. నాకు గురువు, దేవుడు కూడా నీవే. నీవే నాకు ప్రభువు. నాకు దిక్కు నీవే. నా సమస్తము నీవే..🌹🙏

💐💐💐అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు💐💐💐

🙏A carving on the wall at Siddharooda Mata, Hubballi.
15/08/2021

🙏

A carving on the wall at Siddharooda Mata, Hubballi.

1955 వ సంవత్సరం విజయవాడలోజరిగిన యదార్థ సంఘటన🙏విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారం లా నిలబడ...
29/07/2021

1955 వ సంవత్సరం విజయవాడలో
జరిగిన యదార్థ సంఘటన🙏

విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారం లా నిలబడేది.. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు..

ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆవిడ కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది..

1955 వ సంవత్సరం లో జరిగిన యాదర్థ సంఘటన ఇది..

విజయవాడ లో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు.. కాయ కష్టం మీదే బతికేవాడు..

అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదల అయ్యింది.. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమాహాల్ దగ్గర ఉండేవాడు ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకునీ వెళ్ళటానికి..

అలా ఉండగా ఒక రోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతీ టాకీస్ సినిమాహాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండీ ఒక పెద్దావిడ ఎర్రటి చీర నుదుటున పెద్ద బొట్టు తో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది..

అక్కడ నుండి ఆయన రిక్షా లో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా నీకు భయమేయట్లేదా అంటే దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న ఆవిడ మా తల్లీ అమ్మ.. తల్లి దగ్గర బిడ్డలకి భయమెందుకు అంటాడు..

కొంత దూరం వెళ్లగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలి అమ్మ అనగా వెనక నుండి సమాదానం లేదు అదేంటీ అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో అదేంటీ అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అదేంటీ అమ్మ డబ్బులు ఇవ్వలేదు అనగా నీ తలపాగా లో పెట్టాను చూడు అంటుంది.. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒక పక్క, పదిరూపాయల నోటు మరో పక్క ఉన్నాయి.

వెంటనే ఆయనకి అర్ధమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్నఅమ్మ అని..

దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలెడతాడు.. చుట్టు పక్కల ఉన్న వాళ్ళు అందరు పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడుగగా వారికీ జరిగింది చెప్తే బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకి వచ్చింది అమ్మవారే అని అర్ధమవుతుంది...

ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి

ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు..

Jai Hanuman 🙏🙏🙏
08/06/2021

Jai Hanuman 🙏🙏🙏

ఓం నమః శివాయ🙏
31/05/2021

ఓం నమః శివాయ🙏

🙏
25/05/2021

🙏

ఓం నమః శివాయ🙏🙏
22/05/2021

ఓం నమః శివాయ🙏🙏

పంచాంగం :ఏప్రిల్ 22, 2021   గురువారంశ్రీ ప్లవ నామ సంవత్సరంఉత్తరాయణం వసంత ఋతువుచైత్ర మాసం    శుక్ల పక్షంతిధి      : దశమి ...
21/04/2021

పంచాంగం :
ఏప్రిల్ 22, 2021 గురువారం
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : దశమి సా 6.31 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం : మఖ తె 3.20 వరకు
తదుపరి పుబ్బ
యోగం : గండం మ 12.49 వరకు
తదుపరి వృద్ధి
కరణం : తైతుల ఉ 6.48 వరకు
తదుపరి గరజి
సూర్యరాశి : మేషం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : ఉ 5.44
సూర్యాస్తమయం : సా 6.13
రాహుకాలం : మ 01.30 - 03.00
యమగండం : ఉ 06.00 - 07.30
వర్జ్యం : మ 03.22 - 04.57
దుర్ముహూర్తం : ఉ 09.53 - 10.43&
మ 02.53 - 03.43
అమృతకాలం : రా 12.56 - 02.32
శుభమస్తు..

అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు🙏
21/04/2021

అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు🙏

ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి ఒక స్పూన్ *వాము**, ఒక గడ్డ కర్పూరం,4 లవంగాలు ఈ మూడింటిని  ఒక తెల్లటి కాటన్ గుడ్డలో తీసుకుని...
18/04/2021

ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి
ఒక స్పూన్ *వాము**, ఒక గడ్డ కర్పూరం,4 లవంగాలు ఈ మూడింటిని ఒక తెల్లటి కాటన్ గుడ్డలో తీసుకుని, గట్టిగా దంచి, ముక్కు దగ్గర వాసన చూపిస్తే, గట్టిగా 10 నుండీ 15 సార్లు శ్వాసలు తీసుకోమని ప్రోత్సహిస్తే కొద్దిసేపట్లో ఆక్సిజన్ లెవెల్స్ 90 నుండి 99 వరకు పెరుగుతాయి.2గంటలకు ఒకసారి ఈ విధంగా చేస్తే చక్కటి ఫలితం వస్తుంది.

లడక్ లో యాత్రికులకు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు అందిస్తుంటారు మరియు అంబులెన్స్ లలో కూడా అందుబాటులో ఉంచుతున్నారు

తయారు చేయడానికి ఇబ్బంది అయ్యేవారికి "దివ్య ధార" పేరుతో ఆయుర్వేద లేక పతంజలి స్టోర్స్ లో దొరుకుతుంది.

చౌడేశ్వరీమాత ఆలయం, నందవరం, కర్నూలు. బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, నందవరంలో చౌడేశ్వరీమాత ఆల...
16/04/2021

చౌడేశ్వరీమాత ఆలయం, నందవరం, కర్నూలు.

బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, నందవరంలో చౌడేశ్వరీమాత ఆలయం ప్రసిద్ధమైంది.

చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు.

ఈ దేవాలయంలో అమ్మవారి గురించి స్థలపురాణ గాథ ఇలా ఉంది.

పూర్వం నందవరాన్ని పాలించే రాజు ఒకమారు కాశీలో పండితులకు తానిచ్చిన మాట మరచిపోయి, తన వాగ్దానాన్ని తప్పాడు. విప్రుల ప్రార్థన మేరకు వారికి సాక్ష్యం చెప్పడానికి సాక్షాత్తు కాశీ విశాలాక్షి విప్రుల వెనుక బయలుదేరింది కాని ఎవరూ వెనుకకు తిరిగి చూడరాదని షరతు పెట్టింది. అయితే నందవరం చేరేప్పటికి విప్రులు వెనుకకు తిరిగి చూచారు. వెంటనే అమ్మవారు శిలారూపం దాల్చింది. విషయం తెలుసుకొన్న రాజు పరుగున వచ్చి అమ్మవారికి మ్రొక్కి విప్రులకు కానుకలిచ్చాడు. ఆ అమ్మవారే చౌడేశ్వరిగా పూజలందుకొంటున్నది. చౌడేశ్వరి ఆలయం ప్రక్కనే కోదండరామస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నాయి. సంతానం కోరేవారు ఈ ఆలయప్రాంగణంలో ఉన్న వృక్షానికి మ్రొక్కుతారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజు నుండి ఆరు రోజులపాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.🙏

 🙏
16/04/2021

🙏

Address

Sri Lakshmi Nagar
Lakshmi Nagar

Alerts

Be the first to know and let us send you an email when Vandanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vandanam:

Share


You may also like