16/04/2021
శామ్ సాండ్ డ్యూన్స్. (జైసల్మేర్ సిరీస్... పార్ట్ 1).... రాజస్థాన్ పేరు వినగానే అందరూ ముందుగా చూడాలనుకునేవి, ఇండియా లో మరింకెక్కడా కనబడని ఎడారులు మరియు అద్భుతమైన కళ్ళ సంపదను నిక్షిప్తం చేసుకున్న పురాతన కోటలు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో కొన్ని పర్యాటక విశేషాలు మన పాఠకుల కోసం వరుసగా పోస్ట్ లలో. జైసల్మేర్ సిటీ నుంచి సుమారు 110 km దూరం లో ఈ ఎడారి ఇసుక తిన్నెలు ఉంటాయి. అక్కడకు వెళ్ళాలంటే, సిటీ మధ్యలోని కోట వద్ద బైక్ లు, కార్ లు అద్దెకు దొరుకుతాయి. లేదంటే ఒక వాన్ గానీ జీప్ గానీ మాట్లాడుకుని వెళ్ళవచ్చు. ప్రయాణం సుమారు 2 గంటలు పడుతుంది. దారి మొత్తం కొన్ని పదుల సంఖ్యలో ఒంటెలు మామూలుగా తిరుగుతూ కనువిందు చేస్తాయి. ఇక్కడికి చేరుకోగానే, పర్యాటకులు ఎడారి లో కొంత దూరం ఒంటెల మీద సవారి చేస్తూ వెళ్లగలిగే సౌకర్యం ఉంది, లేదంటే స్థానికులు జీప్ ల మీద కూడా తీసుకు వెళ్తారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే, రోడ్ కు ఒక వైపున మొత్తం ఎడారి, ఇంకో వైపున మామూలుగా భూమి ఉంది అనేక రెస్టారెంట్ లు, టీ దుకాణాల తో పర్యాటకులకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ నైట్ క్యాంపింగ్ సదుపాయం కూడా ఉందండోయ్. ఇది గానీ తీసుకుంటే, రాజస్థానీ సాంప్రదాయ నృత్యాలతో పాటు స్థానిక భోజనంతో కూడిన విందు ఒక ప్రత్యేక ఆకర్షణ. మరిన్ని జైసల్మేర్ కు సంభందించిన విషయాలతో మరొక పోస్ట్ లో మీ ముందుకు వస్తుంది మీ తెలుగు ట్రావెల్.
ఫోటో:- .rahul
కంటెంట్:- .rampalli