24/08/2023
గుర్రంకొండ లో చంద్రయాన్-3 సక్సెస్ - యువత సంబరాలు
చంద్రయాన్ - సాఫ్ట్ లాండింగ్ అయిన సందర్భముగా గుర్రంకొండ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు , "By Mr.SMT" టీం ,హెల్పింగ్ మైండ్స్ సభ్యులు , పెద్దలు స్థానిక బస్టాండ్లో ఉప్పుతో చంద్రుడిని గీసి ,ఇస్రో టీం కు కృతఙయతలు తెలిపారు . అనంతరం కేక్ కట్ చేసి , బాణాసంచాలు పేల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు . ఇందుకు తోడుగా " by Mr.SMT " టీం చేసిన థెర్మోకోల్ చంద్రయాన్ ను చూడడానికి జనాలు తరలి వచ్చారు ..
"By Mr.SMT "యూట్యూబ్ ఛానల్ తాహిర్ మాట్లాడుతూ తాము గర్వంగా ఫీల్ అవుతున్నారన్నారు .
గుర్రంకొండ లో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఫుడ్ బ్యాంకు నందు శ్రీ లక్ష్మి స్వీట్స్ వారు ఆహారాన్ని అందుబాటులో ఉంచి తమ ఆనందాన్ని చాటుకున్నారు .
జైహో భారత్ ... వందేమాతరం... నినాదాలతో యువత హోరెత్తారు ...