Murali Krishna Travels Eluru

Murali Krishna Travels Eluru for Bus tickets booking
contact numbers
UMA SHANKAR
94402 61557
94912 61557

19/11/2023
18/11/2023

*ఆన్ లైన్ ధరలకన్నా తక్కువకే బస్ టిక్కెట్లు.*

చాలామంది ఎక్కడో బెంగళూరులో ఉన్న రెడ్ బస్...హైదరాబాద్లో ఉన్న అభీ బస్ లలో టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. కానీ అలాంటి వారి వలన గ్రామీణ ప్రాంతాల్లో పేద ఏజెంట్లు జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్వయం ఉపాధి పొందే వారివద్ద కూడా అప్పుడప్పుడు టిక్కెట్లు బుక్ చేయండి.

ఎందుకంటే రెడ్ బస్, అభీ బస్ వారికి ఒక్క బస్సు కూడా లేకపోయినా ఆఫర్లు, కూపన్లు, ఫ్రీ జర్నీలు అంటూ ప్రచారం చేసుకుంటూ ఆ రెండు కార్పొరేట్ కంపెనీలు కోట్లలో అర్జిస్తున్నాయి. వారి వలన గ్రామీణ ప్రాంతాల్లో పేద ఏజెంట్లు జీవనోపాధి కోల్పోతున్నారు.

ఏలూరు నుంచి ప్రయాణం చేసేవారిని *అభిబస్ వారుగాని, రెడ్ బస్ వారుగానీ బాద్యత తీసుకుని మాలాగా దగ్గర ఉండి బస్సులు ఎక్కించగలరా? ఆల్టర్నేట్ జర్ని ఇవ్వగలరా? లేదా నేను చెప్పిన రూట్లలో ఫ్రీ జర్నీ ఆఫర్లు ఇవ్వగలరా? సర్వీస్ చార్జీలు లేకుండా ఇవ్వగలరా? జీఎస్టీ లేకుండా ఇవ్వగలరా? ఏజెంట్ చార్జీలు లేకుండా ఇవ్వగలరా?* మరలాంటప్పుడు ఆ సైట్ లలో టిక్కెట్లు ఎందుకు బుక్ చేయాలి? ఒక్కసారి కంపేర్ చేసుకోండి. తరువాతే మాకు కాల్ చేయండి.

*మా లాంటి వారి ద్వారా టిక్కెట్లు బుక్ చేస్తే మాకు పరోక్షంగా జీవనోపాధి కల్పించిన వారౌతారు. పైగా మీరు బస్సు ఎక్కేవరకు మేము బాద్యత తీసుకుంటాము.* అందుకే ప్రయాణం మీది బాద్యత మాది. మావద్ద నో ఆఫర్స్, నో కూపన్స్, నో డిస్కౌంట్ *ఆన్ లైన్ ధరలకన్నా తక్కువకే* అనగా డైరెక్ట్ ఖచ్చితమైన నాన్ ఏసీ బస్సు టికెట్స్ పై 5% తగ్గింపు.

*అభి బస్-రెడ్ బస్ లాగ సర్వీస్ చార్జీలు, జీఎస్టీ, ఏజెంట్ చార్జీలు భారీగా వేసి 10శాతం డిస్కౌంట్ అని, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని మిమ్మల్ని మోసం చేయలేము.*

ఇప్పుడు ఏలూరు నుండే డైరెక్టర్ గా *బెంగళూరు, భువనేశ్వర్, బరంపురం, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, విజయనగరం, *తిరుపతి, నెల్లూరు, *చెన్నై,* హైదరాబాద్ లో *మేడ్చల్ రూట్, జీడిమెట్ల రూట్, మెహిదీపట్నం-గచ్చిబౌలి రూట్, కూకట్ పల్లి-బిహెచ్ఇఎల్-బీరంగూడ రూట్* లకు డైలీ ఏసీ/నాన్ ఏసీ స్లీపర్/సిట్టింగ్ బస్సులు కలవు.
టికెట్స్ కొరకు సంప్రదించవలసిన నెంబర్
9440261557
9491261557

04/11/2021

Happy

100మంది అడ్డొచ్చారు అయినాసరే ముఖ్యమంత్రినే అరెస్ట్ చేసింది. సివిల్ సర్వంట్స్ నిజాయితీగా తమ డ్యూటీ తాము చేస్తే దేశంలో రాజ...
16/07/2021

100మంది అడ్డొచ్చారు అయినాసరే ముఖ్యమంత్రినే అరెస్ట్ చేసింది.

సివిల్ సర్వంట్స్ నిజాయితీగా తమ డ్యూటీ తాము చేస్తే దేశంలో రాజకీయ నాయకుల అరాచకం సగానికి పైగా తగ్గిపోతుందండి అని మాజీ సివిల్ సర్వంట్స్ చెబుతూ ఉంటారు. అంతే కాదు తమకు తాముగా బంధీలుగా మారి, సివిల్ సర్వంట్స్ నాయకుల ఒత్తిడికి తలోగ్గుతూ ఉంటారు. కర్ణాటకకు చెందిన సూపర్ కప్ రూపా దివాకర్ మోడెల్,ఆమెను లేడీస్ సూపర్ కప్ రూప అని పిలుస్తారు. కర్ణాటకలో ఆమె పేరు చెబితే రాజకీయ నాయకులకు హడల్, ఆమె వస్తుందంటే రెండు అడుగులు వెనక్కి వేసి మరి మాట్లాడుతారు. ఇక తన కింద పనిచేసే టీమ్కి అయితే ఆమె చెప్పిన పని తూచ తప్పకుండా చేయాల్సిందే. కర్ణాటకలో చదువుకున్న ఆమె రెండువేల బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ . ఆమె తండ్రి రిటైర్డ్ ఇంజనీర్ . ఆమెకు జాతీయ స్థాయిలో నలభై మూడవ ర్యాంక్ వచ్చింది. అంతే కాదు హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీలో ఫిఫ్త్ ర్యాంక్ ట్రైనింగ్ . ఇక రూప మొదటిసారిగా మధ్యప్రదేశ్ నాటి సీఎం ఉమా భారత్ ని అరెస్ట్ చేసినప్పుడు వార్తలకు ఎక్కారు.

హుబ్లి అల్లర్ల కేసు లో స్థానిక కోర్ట్ నాన్ బెయిల్ వారంటీ ఇష్యూ చేయడంతో ఆమెకు ఆ పని అప్ప చెప్పారు ఉన్నత అధికారులు. వి ఐ పి కేసు కావడంతో స్పీడ్ గా ఆమె నిజాయితీగా ధైర్యంగా తన పని పూర్తి చేశారు. కానీ కోర్ట్ ఆర్డర్ కారణంగా నా కెరీర్ లో అదే సులభమైన పని అంటారు రూపా గారు . కానీ తర్వాత మాజీ ముఖ్యమంత్రి యువగల్ రెచ్చగొట్టే స్పీచ్ ఇవ్వడంతో, అతని అనుచరులు మూడు ప్రభుత్వ వాహనాలు తగలబెట్టారు. దీనితో ఎస్పీ గా ఉన్న రూప, అతని వీడియో చూసి చట్ట పరంగా చర్య తీసుకొని కేసు పెట్టి అరెస్ట్ చేయమని స్థానిక పోలీసులకు చెప్పింది. ఆ ప్రాంత డిఎస్పీ కి ప్రత్యేకంగా చెప్పి ఆదేశాలు జారీ చేసింది. డిఎస్పీ మసూది ఎస్పీ ఆదేశాలు అమలు చేయక పోగా వాదించారు. మాజీ మంత్రి పవర్ ఫుల్ లీడర్ ఆయన్ను అరెస్ట్ చేయకూడదని చెప్పడమే కాకుండా ప్రతి క్షణం అతనికి ఫోన్ చేసి వివరాలు చెప్పారు. కానీ రూప పోలీస్ స్టేషన్ కి వెళ్లి రాత్రి తొమ్మిది గంటల వరకు కూర్చొని అతన్ని స్టేషన్ కు రప్పించారు. మంత్రి మర్యాదగా రాకుంటే నేనే వెళ్తాను తరువాత పరిస్థితి మారిపోతుందని వార్నింగ్ ఇవ్వడంతో సదరు మాజీ మంత్రి యువగల్ లొంగిపోయారు.

రాత్రి మొత్తం స్టేషన్ లోనే గడిపి తెల్లవారుజామున కోర్ట్ లో ప్రవేశపెట్టారు. అంతేనా డ్యూటీ నిజాయితీగా చేయకుండా నిందితుడి సహాయం చేశారని డిఎస్పీ మీద చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. విచారణ తరువాత డిఎస్పీ తప్పు చేసాడని తేలడంతో అతను ఏడాది పాటు సస్పెండ్ కూడా అయ్యాడు. ఈ ఒక్కటే కాదు బెంగళూరు డీసీపీ గా పని చేస్తున్నప్పుడు కర్ణాటక మొత్తానికి షేక్ చేసి పడేసారు. ఆర్డర్ ఫోర్సస్ డిస్కప్లైన్ గా ఆమె నియమించిన తర్వాత కానీ తాము ఎంత పెద్ద తప్పు చేశామో వారికి అర్థం కాలేదు. తన ఫోర్స్ లో పేర్లు చాలా మంది ఉన్నా కూడా సగానికి పైగా వి ఐ పి లకు గన్ మన్ లుగా వెళ్లారు. అవసరం లేకుండా ఒక్కొక్క నేతకు స్టేటస్ కోసం ఐదారుగురు పోలీసులను గన్ మన్ గా పెట్టుకున్నారు. దీంతో ఆమె అనవసరంగా ఉన్న వారినందరినీ కూడా వెనక్కి పిలిపించేశారు. ఉన్నత అధికారులు వారించినా సరే యాక్సెస్ గన్ మెన్ లు వారికి ఎందుకు, జనం సొమ్ముతో వారికి సోకుల అంటూ, రెండు వందల పదహారు మంది గన్ మెన్ లను వెనక్కి పిలిపించారు.

అంతే నోరు తెరిచి కూడా ఏ నాయకుడు అడగలేదు. ఎందుకంటే అక్కడ ఉంది రూప. ఈ ఇన్సిడెంట్ మాత్రమే కాదు, ఒక అధికార పార్టీ ఎం ఎల్ ఏ అల్లర్లు చేయించడం తేలడంతో అతని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చినందుకు, ఏకంగా ప్రీవిలేజ్ కమిటీ ముందుకు పిలిచి బెదిరించే ప్రయత్నం చేశారు నేతలు. కానీ చట్టం చాలా క్లియర్ గా బ్యూరో క్రిట్స్ కి భద్రత కల్పిస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు అంటారు ఆమె. నిజాయితీగా ఉన్నంత వరకు మనల్ని ఎవరు ఏమి చేయలేరు అంటారు. చివరకు కర్ణాటక లో కొత్తగా ఏర్పడిన యాదిరి జిల్లాకు ఎస్పీ గా ట్రాన్స్ఫర్ చేశారు అధికారులు. అక్కడ కనీసం ఎస్పీ ఆఫీస్ కూడా సరిగ్గా లేదు. పైగా తనకు కోటర్స్ కూడా లేకపోవడంతో తన భర్తకు ఇచ్చిన కోటర్స్ లో ఉన్నారు. అది కూడా ఒక పల్లెటూరులో తన కూతురు చదువు కూడా తన ఇంటికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్కూల్ లోనే మూడేళ్ళు చదివించారు. ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే తన కూతురు పలక పట్టుకొని కింద కూర్చొని అందరితో పాటు చదువుకుంది. స్కూల్ లో కనీస వసతులు కూడా లేవు.

అయినా సరే అందరి పిల్లలు తన కూతురు లాంటి వారే అంతా సమానమే అని తన కూతురు ప్రైమరీ ఎడ్యుకేషన్ పల్లెటూరు లోని ప్రైమరీ స్కూల్ లో చదివించారు. ఇక మధ్య కాలంలో జైలుల శాఖ డీజి గా ఆమె వెళ్ళగానే, శశికళ కు ఉన్న వి వి ఐపీ ట్రీట్మెంట్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఆధారాలు సేకరించి శశికళ నుంచి రెండు కోట్లు తీసుకొని జైలు అధికారులు ఆమెకు వి ఐ పి ట్రీట్మెంట్ ఇస్తున్నారని మీడియా కి లీక్ చేయడంతో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు షేక్ అయిపోయాయి. అదంతా తప్పని ఆమె మీదనే అభాండాలు వేసారు కూడా. చివరకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వినాయకరామ్ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ జరపగా రూపా చెప్పినవన్నీ నిజమని తేలింది. దీనితో మళ్ళీ ప్రక్షాళన మొదలు పెట్టారు. ఎక్కడ నిజాయితీగా పని చేసినా సరే ఆమెకు ట్రాన్స్ఫర్ అనేది కామన్ . ఇరవై ఏళ్లలో ఆమెకు దాదాపుగా నలభై రెండు ట్రాన్స్ఫర్ లు జరిగాయంటే నిజాయితీగా ఉంటె ఎంత కష్టం అర్థం చేసుకోవచ్చు. అయినా సరే తనకు అప్పజెప్పిన బాధ్యతను ఖచ్చితంగా నిజాయితీగా, నిక్కచ్చిగా చేస్తారు రూప.

బ్యూరో క్రేట్స్ తమకుతాము విధించుకున్న చైన్స్ వదిలించుకుంటే కొత్త భారతాన్ని చూస్తాం అంటారు రూప. మరి మన ఐఏఎస్ ఐపీఎస్ లు పని చేయగలుగుతారా? లేదా అనేది మాత్రం చూడాలి. అందరూ రూపాలు అయితే మాత్రం అవినీతి కంపు నాయకుల దరిద్రం కాస్తైనా వదులుతుంది మరి. ఇండియా రూపురేఖల మారుద్దాం అనుకుంది రూప. కానీ ఇరవై ఏళ్లలో దాదాపుగా నలబై రెండు ట్రాన్స్ఫర్ లు. అయినా సరే ఎక్కడ తగ్గేది లేదు. తనకు వీలు ఉన్నంత వరకు కూడా అందరి రూపు మార్చుకుంటూ నే వచ్చింది. కానీ ఫలితంగా ఆమెకు మిగిలింది ట్రాన్స్ఫర్ మాత్రమే. మరి ఇలాంటి ఆఫీసర్ లకు తప్పకుండా మనం సెల్యూట్ చేయాల్సిందే మరి.

ఎంత మంది కి గుర్తుంది ఈ బ్లోఔట్ ?మన కొనసీమ వాళ్ళు మరచిపోలేని మచ్చ !అది 1995 జనవరి నెల 8 తారీకు ! తూర్పుగోదావరి జిల్లా పా...
13/07/2021

ఎంత మంది కి గుర్తుంది ఈ బ్లోఔట్ ?

మన కొనసీమ వాళ్ళు మరచిపోలేని మచ్చ !

అది 1995 జనవరి నెల 8 తారీకు ! తూర్పుగోదావరి జిల్లా పాసర్లపూడి దగ్గర ఒక్కసారి గా పెద్ద శబ్ధం ఎమిటా అని అందరు ఉలిక్కిపడ్డారు ! తీరా చూస్తే అక్కడ ongc లో ఫైర్ !

సూమారు ఆ చుట్టు పక్కల మోత్తం దాని వెలుగుతోనే సుమారు ఎనిమిది రోజులు గడిపారు ! ఆ ఎగసిపడే మంటలను ఆర్పడానికి అక్షరాల అరవై ఐదు రోజులు పట్టింది !

బర్నింగ్ టైం స్టార్టెడ్ సాయంత్రం 6:50 pm (08/01/1995 to 15/03/1995) - అప్పట్లో సుమారు 9.2 కోట్ల నష్టం ONGC కి !

చూస్తూ వుంటే అప్పుడే 26 సంవత్సారాలు గడిచిపోయాయి. ఇంకా అది ఎదో నిన్న మెన్న జరిగిన దానిలా అనిపిస్తువుంటుంది !

అప్పట్లో పిల్లలు పెద్దలు టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళినట్టు వెళ్లేవారు !

ఇది ఇప్పటికి ! ఎప్పటికి ఓ మరచిపోలేని మచ్చే !

24/06/2021

🌹🌼ఏలూరు గురించి తెలుసుకుందాం🌼 🌹

ఆంధ్ర ప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం.ఏలూరు ఒకప్పుడు హేలాపురిగా వ్యవహరించబడేది, అంగ్లేయుల కాలంలో ఎల్లొర్ అనికూడా పిలిచేవారు. 1866 లో మునిసిపాలిటిగా ఏర్పడింది. దేశంలో రెండవ మోడల్ మునిసిపాలిటి 2005 లో మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తించబడింది.ఏలూరు ప్రస్తుతం ఒక స్పెషల్ గ్రేడ్ మునిసిపల్ కార్పొరేషన్, మండల కేంద్రం, జిల్లా కేంద్రం, శాసనసభ నియోజక వర్గం, పార్లమెంట్ నియోజక వర్గం కూడాను.

మద్రాసు - కలకత్తా జాతీయ రహదారి (ఎన్ఎచ్ 5) పై ఏలూరు నగరం విజయవాడ నుండి 63 కి.మీ. రాజమండ్రి నుండి 98 కి.మీ. దూరంలో ఈ రెండు నగరాల మధ్య ఉంది. జిల్లా కేంద్రమైనందున ప్రభుత్వ కార్యాలయాల కేంద్రంగాను, చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల వ్యాపార, వైద్య, విద్య, రవాణా అవసరాల కేంద్రంగా ఉంటున్నది.వరి, కూరగాయలు, పొగాకు వర్తకం, చేపల ఎగుమతి, రాపెద్ద నిమ్మకాయల సి.ఆర్.రెడ్డి కాలేజి, అంబికా దర్బార్ బత్తి, జూట్ మిల్లు, తమ్మిలేరు, కృష్ణ కాలువ, సమీపంలో కొల్లేరు సరస్సు - ఇవి ఏలూరు గురించి చెప్పేటప్పుడు ప్రధానంగా ప్రస్తావించ దగిన అంశాలు.
తమ్మిలేరుపై నిర్మించిన తూర్పు లాకులు

ఏలూరు నగరానికి ఒక ప్రక్క పల్లపు ప్రాంతాలు కొల్లేరు, కైకలూరు. మరొక ప్రక్క మెరక ప్రాంతాలు చింతలపూడి, జంగారెడ్డిగూడెం ఉన్నందున ఇక్కడి నిత్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రభావం కనిపిస్తుంది. మెరక ప్రాంతమైన చింతలపూడి వైపు నుండి వచ్చే తమ్మిలేరు వాగు ఏలూరి చివర రెండుగా చీలుతుంది అశోక్ నగర్ వద్ద . ఎడమవైపు చీలిన వాగు తంగెళ్లమూడి మీదుగా ప్రవహిస్తూ నగరానికి ఒక వైపు సరిహద్దుగా ఉంటుంది. రెండవ చీలిక ఆశోక్ నగర్, అమీనా పేట మీదుగా ప్రవహిస్తూ బస్‌స్టాండు, సి.ఆర్.రెడ్డి కాలేజీ పక్కగా ప్రవహిస్తూ, నగరానికి వేరే సరిహద్దుగా కనిపిస్తుంది. ఈ రెండు చీలికలమధ్య డెల్టాలా ఏలూరు ప్రధాన పట్టణం వుంటుంది. ఈ కారణం వల్లే నాగిరెడ్డి గూడెం ప్రాజెక్ట్ కట్టక మునుపు ఏలూరు ముంపుకు గురి అయ్యేది.

కృష్ణానది నుండి వచ్చే ఏలూరు కాలువ పట్టణం మధ్యలో నైఋతి నుండి ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది.కలిసి కొల్ గోదావరి నుండి వచ్చే ఏలూరు కాలువ, కృష్ణ కాలువ, తమ్మిలేరు - ఇవి మూడూ పాలగూడెం మల్కాపురం వద్ద కోలేరులో కలవడానికి సాగుతాయి. ఈ కాలువల సంగమం గురించి వేమూరి వెంకటేశ్వరరావు "ఈమాట" అంతర్జాల పత్రికలో "మరపురాని స్మృతులు" అనే వ్యాసంలో ఇలా వ్రాశాడు

ఊరికి చుట్టూ మూడు పెద్ద ఏరులున్నాయి. అందుకనే మా ఊరిని ఏలూరు అని అంటారు. ... తరువాత పండితులెవరో హేలాపురి అని సంస్కృతీకరించారు కూడాను. కృష్ణ, గోదావరీ నదుల సంగమం మా ఊరి కాలవ. తూర్పు లాకుల దాకా గోదావరి నీళ్ళు, పడమటి లాకుల దాకా కృష్ణ నీళ్ళూ. కృష్ణ ఎత్తు, గోదావరి పల్లం. ఆ రెండునదులూ కాలవలో సమతలంగా కలపడానికి తూర్పు లాకులు, పడమటి లాకులు ఉండేవి. ఆ లాకులు ముయ్యడం, తియ్యడం, పడవలని జాగ్రత్తగా కాలవలోకి పంపించడం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉండేది. చైత్ర వైశాఖ మాసాల్లో లాకులు కట్టేసి కాలవ మూసేసే వాళ్ళు. అప్పుడు కాలవ ఎండి పోయేది. మళ్ళీ మృగశిర కార్తె రాంగానే, కాలవ వదిలే వాళ్ళు. మళ్ళీ ఇంచక్కా కొబ్బరికాయలు, అరిటిపళ్ళ పడవలూ తూర్పునించి పడమరకీ, పడమటినుంచి తూర్పు వేపుకీ వెళ్ళేవి. ఆ కాలవ నీళ్ళే పంపుల చెరువుల్లోకి పట్టి ఉంచేవాళ్ళు, ఎండా కాలంలో మంచినీటి కరువు రాకండా! ఇప్పుడు ఆ గొడవే లేదు. కాలవలో సమృద్ధిగా నీళ్ళు ఎప్పుడూ ఉండవు. కాలవలో పడవలు లేవు. పంపుల చెరువులు పూడి పోతున్నాయి.

తమ్మిలేరు అనే యేరు ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదలవుతుంది. ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జల్లాలలో సుమారు 120 మైళ్ళు ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. ఏలూరులో ఎఫ్.సి.ఐ. గోడౌనుల దగ్గర రెండుగా చీలుతుంది. ఆ చీలికలు మొండికోడు, పెదయడ్లగాడి అనే రెండు స్థలాల వద్ద కొల్లేరులో కలుస్తాయి

ఏలూరు పెద్దబజారు
హేలాపురి (ఏలూరు) పాత కాలంనుండి వేంగి అను రాజ్యములో భాగముగా ఉంది. తూర్పు చాళుక్యులు, వేంగి రాజధానిగా 700 నుండి 1200 వరకు తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. ఏలూరు (హేలపురి) అప్పటి చాళుక్య సామ్రాజ్యములో ఒక ప్రాంతముగా ఉండేది. 1471లో ముస్లింల దండయాత్ర జరిగే వరకు ఏలూరు కళింగ రాజ్యములో భాగముగా ఉంది. ఆ తరువాత గజపతుల చేతుల్లోకి వచ్చి వారి పరిపాలనలో ఉంది. 1515లో శ్రీ కృష్ణదేవరాయలు గజపతుల నుండి దీనిని చేజిక్కించుకొన్నాడు. ఆ తరువాత గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా వశమైంది. ఏలూరుకు సమీపములో ఉన్న పెదవేగి, గుంటుపల్లె (జీలకర్ర గూడెం) గ్రామాలలో ఇందుకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

బ్రిటిష్ వారి కాలంలో ఉత్తర సర్కారు ప్రాంతాలను జిల్లాలుగా విభజించినప్పుడు ఏలూరును మచిలీపట్నం జిల్లాలో చేర్చారు. తరువాత 1859లో గోదావరి జిల్లాలో భాగమైంది. తరువాత కృష్ణా జిల్లాకు కేంద్రంగా ఉంది. 1925లో పశ్చిమ గోదావరి జిల్లాలను ఏర్పరచినపుడు ఆ జిల్లాకు కేంద్రంగా ఏలూరు అయ్యింది. పట్టణం ఎదుగుదల ఫలితంగా 2005 ఏప్రిల్‌లో ఏలూరు మునిసిపాలిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చింది. ఆ సమయంలో చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలు ఏలూరు నగరంలో కలుపబడ్డాయి. ఆ విధంగా నగర జనాభా 3, 50, 000కు చేరుకొంది.

పేరు వెనుక చరిత్ర
ఏల అన్న చిన్న ఏరు ఈ పట్టణ పరిసరాల్లో ప్రవహించడంతో ఏలూరు అన్న పేరు ఏర్పడివుంటుందని బూదరాజు రాధాకృష్ణ వంటి పరిశోధకులు భావిస్తున్నారు.
ప్రముఖులు.
సి. ఆనందారామం
వి. యస్. రమాదేవి (భారతదేశం గర్వించతగ్గ అడ్మినిస్ట్రేటర్, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్)
దువ్వూరి సుబ్బారావు (మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్)
ఎల్.వి.ప్రసాద్ (సినిమా రంగం, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రసాద్ లాబ్స్ అధినేత)
కోండ్రు సుబ్బారావు 1st m.p in west godavari (CPI) 1952
వీరమాచనేని విమలాదేవి M.P (CPI) 1962
అత్తులూరి సర్వేశ్వరరావు MLA. (Eluru.CPI) 1962
పూడి అప్పలస్వామి AITUC నాయకులు
వంకినేని సత్యన్నారాయణ
రంభా వెంకటప్పయ్య
డా.వి.వి.జి.తిలక్
కడుపు రాములు
కొమ్మారెడ్డి సూర్యనారాయణ (మాజీ లోకసభ, రాజ్యసభ సభ్యులు)
గారపాటి సత్యనారాయణ (ఏలూరు తొలి ఎం.ఎల్.ఎ)
మాగంటి మురళీమోహన్ (తెలుగు సినిమా నటుడు, నిర్మాత.జయభేరి గ్రూపు అధిపతి., రాజముండ్రి పార్లమెంట్ సభ్యులు)
పసుపులేటి కన్నాంబ (కన్నాంబ ప్రసిద్ధ రంగస్థల నటి, గాయని. చలనచిత్ర కళాకారిణి)
సిల్క్ స్మిత
నండూరి సుబ్బారావు (ఎంకిపాటలు రచయత)
హితశ్రీ (మతుకుమల్లి వెంకట నరసింహ ప్రసాదరావు)
బడేటి వెంకటరత్నం నాయుడు (మున్సిపల్ చైర్మన్)
బడేటి కోట రామారావు ఎం ఎల్ ఏ
ఆళ్ళ కాళీకృష్ణ
అంబికా కృష్ణ
వి వి బాల కృష్ణ
కారుమంచి రామమూర్తి
బెండపూడి వెంకట సత్యనారాయణ
మోతే వేదకుమారి
రేకందార్ అనసూయాదేవి
మోహన భోగరాజు
పద్మనాభం జుజ్జవరపు శాస్త్రవేత్త, సునామి హెచ్ఛరికల కేంద్రం, INCOIS
ముఖ్య ప్రాంతాలు సవరించు
ఏలూరు నగరం ప్రధానంగా జాతీయ రహదారి వెంట విస్తరించి ఉంది. పట్టణం మధ్యగా తమ్మిలేరు కాలువ ప్రవహిస్తుంది. స్థూలంగా పట్టణాన్ని I టౌన్ (తమిళేరు కాలువకి ఆవల వున్న ప్రాంతం), II టౌన్ (తమిళేరు కాలువకి ఇవతల వున్న ప్రాంతం) గా విభజించవచ్చు. అయితే పోస్టల్ వారి ప్రకారం ఏలూరు-1 (తమిళేరు కాలువ నుండి తూర్పు వైపు వున్న ప్రాంతం), ఏలూరు-2 ( పవర్ పేట, ఆర్ ఆర్ పేట తదితర ప్రాంతాలు), ఏలూరు-3 (శనివారపు పేట), ఏలూరు-3 (చాటపర్రు ప్రాంతం), ఏలూరు-5 (రైల్వే స్టేషన్, ఆదివారపు పేట ప్రాంతాలు, తంగెళ్ళమూడి, ఏలూరు-6 (నరసింహారావు పేట, అమీనా పేట, అశోక్ నగర్ ప్రాంతాలు), ఏలూరు-7 (వట్లూరు, విద్యా నగర్, శాంతినగర్, సత్రంపాడు ప్రాంతాలు) లుగా విభజించబడింది.

వ్యాపార కేంద్రాలు: మెయిన్ బజారు, ఆర్.ఆర్. పేట, బిర్లా భవన్ సెంటర్, చాటపర్రు రోడ్ సెంటర్, ఘడియారపు స్తంభం, నరసింహా రావు పేట, పత్తేబాద, జి యన్ టి రోడ్.
ప్రయాణ కేంద్రాలు: పెద్ద రైల్వే స్టేషను, పవర్ పేట రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషన్, క్రొత్త బస్ స్టాండు, పాత బస్ స్టాండు, ఆశ్రం హాస్పిటల్.
వైద్య కేంద్రాలు: రామ చంద్రరావు పేట, వెంకట్రావు పేట, పెద్దాసుపత్రి, ఆశ్రం హాస్పిటల్, మెడికల్ కాలేజీ
కూడళ్ళు: I టౌన్ : గడియారపు స్తంభం సెంటర్, పెద్ద వంతెన సెంటర్, కర్ర వంతెన సెంటర్, వసంత మహల్ సెంటరు, బిర్లా భవన్ సెంటర్, కొత్త రోడ్డూ, వంగాయగూడెం సెంటర్ చౌరాస్తా, జ్యూట్ మిల్ జంక్షన్
II టౌన్ కూడళ్ళు : పాత బస్ స్టాండు సెంటర్, పవర్ పేట సెంటర్, ప్రెస్ గేటు సెంటర్, రమామహల్ సెంటరు, మధులత సెంటర్, విజయవిహర్ సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటరు
ప్రధాన నివాస కేంద్రాలు: పవర్ పేట, గాంధీ నగరం, కొత్త పేట, నరసింహారావు పేట, రామచంద్రరావు పేట, విద్యా నగర్, శాంతినగర్, సత్రంపాడు, ఖాదర్ జండా, ఖతీబ్ వీధి, ఆదివారపు పేట, పెన్షన్ మొహాల్ల, అమీన పేట, అశోక్ నగర్, ఇస్రేల్ పేత, పత్తేబాద, గవరవరం, తంగెళ్ళమూడి.
విద్యా కేంద్రాలు: సత్రంపాడు (డిగ్రీ, పి.జి., బి.యిడి, పాలిటెక్నిక్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ తదితర సి.ఆర్.ఆర్ కాలేజీలు, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ) ఆర్ ఆర్ పేట, విద్యానగర్, గవరవరం (సెయింట్ దెరిసాస్ కాలేజీలు, సెయింట్ జేవియర్ స్కూల్స్) దుగ్గిరాల (డెంటల్ కాలేజీ), మల్కాపురం (ఆశ్రం హాస్పిటల్, మెడికల్ కాలేజీ)
నగరంలో కలిసిపోయిన పరిసర గ్రామాలు: తంగెళ్ళమూడి, సత్రంపాడు, గవరవరం, శనివారపుపేట, చోదిమెళ్ళ, చాటపర్రు.
మెహర్ బాబా సెంటర్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు

ఏలూరు నగరం, రోడ్డు, రైలు, జలమార్గాల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ నగరాలు, పట్టణాలు చాలా బాగా అనుసంధానించబడి ఉంది.

రోడ్డు మార్గాలు
జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 43, జాతీయ రహదారి 44 లతో ఈ నగరం అనుసంధానమై ఉంది.జిల్లా కేంద్రంగా కూడా ఏలూరునుండి జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రోడ్డు ప్రయాణ సదుపాయం ఉంది. బస్సు, ఆటో, రైల్వే రవాణా సేవలు ప్రధానమైనవి. ఏలూరు పాత బస్సు స్టేషన్, ఏలూరు కొత్త బస్సు స్టేషన్ల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ బస్సు నడుపుతోంది.

రైలు మార్గాలు

ఏలూరు రైల్వే స్టేషన్
ఏలూరు రైల్వే స్టేషను విజయవాడ రైల్వే డివిజన్లొని దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన ఒక రైల్వే స్టేషను.పవర్‌పేట రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషను నగరానికి చెందిన శాటిలైట్ స్టేషన్లు. ఈ స్టేషన్లు హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ఉన్నాయి.

గన్నవరం (విజయవాడ) ఏలూరుకు సమీపంలో ఉన్న విమానాశ్రయం (35 కి.మీ) . ఇక్కడి (విజయవాడ) నుండి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, అహ్మదబాద్, పూనే, జైపూర్, రాజమండ్రి, విశాఖపట్నం, కోల్ కత్తా, ఢిల్లీలకు ప్రతిరోజూ విమానాలు ఉన్నాయి (ఎయిర్ కోస్త, ఎయిర్ డెక్కన్, కింగ్‌ఫిషర్, ఏయిరిండియా సంస్థల ద్వారా) . ఇప్పుడు రాత్రి వేళల్లో కూడా విమానయానం అందుబాటులో ఉంది.

జాతీయ జలమార్గం 4 గా ప్రకటించబడిన జలమార్గం తీర ప్రాంతం వెంబడి కాకినాడ, ఏలూరు, కొమ్మమూరు, బకింగ్‌హాం కాలువ ద్వారా వెళ్తుంది.

ఆర్.ఆర్ పేటలోని సెంట్రల్ ప్లాజ
పారిశ్రామికంగా ఏలూరు చెప్పుకోదగినంత అభివృద్ధి సాధించలేదనే అనవచ్చును. ఎంతో కాలంగా నడుస్తున్న జూట్ మిల్లు తప్పించి ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి కలిగించే పెద్ద పరిశ్రమలు లేవు. అంబికా దర్బార్ బత్తి మాత్రమే ఏలూరు నుండి ప్రసిద్ధమైన బ్రాండ్ ఉత్పత్తి. పారిశ్రామిక వాడలో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు ఇంకా కుటీర, చిన్నతరహా పరిశ్రమల స్థాయిలోనే ఉన్నాయి. కనుక ఏలూరులో వ్యాపారం అధికంగా రెండు రంగాలలో కేంద్రీకృతమయ్యింది - చుట్టుప్రక్కల లభించే వ్యవసాయ,

చేపలు, రొయ్యలు ప్రధానంగ ఎగుమతి అవుతున్నాయి, దీనికి కారణం కొల్లేరు, దాని చుట్టుతా ఉన్న చేపల చెరువులు, రొయ్యల చెరువులు. కొల్లేరువైశాల్యం రోజు, రోజుకి తరిగి పోతూ వస్తోంది,
పత్తేబాదలో వస్త్రాలు నేస్తారు, ముఖ్యంగా చీరలు నేస్తారు.
ఏలూరు తివాచీ, చేనేత పరిశ్రమలు - ఏలూరులో తివాచీలు అధికంగా మహమ్మదీయులచే నేయబడుతున్నాయి. ఎక్కువగా ఎగుమతి చేయబడుతున్నాయి.
తెలుగుకళ్యాణం.కాం కూడా ఏలూరులోనున్న సంస్థ.
శ్రీకృష్ణ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏలూరు.
అంబికా గ్రూప్ - 60 యేళ్ళపైగా ఈ వ్యాపార సంస్థ ఉత్పత్తి చేసే "అంబికా దర్బార్ బత్తి", మరి కొన్ని అగర్‌బత్తిలు దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ఈ గ్రూప్ అధిపతులు ఇంకా సినిమా నిర్మాణం, విద్యుత్తు, హోటళ్ళు వంటి మరికొన్ని వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. సుమారుగా 5000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
పూర్ణిమా కెమికల్ ఇండస్ట్రీస్ . ఈ సంస్థ ద్వారా ఉపాధి లభిస్తున్నది.
జూట్ మిల్లు - ఈస్టిండియా కమర్షియల్ కార్పొరేషన్ వారి జనపనార పరిశ్రమ పట్టణం నడిబొడ్డున ఉన్న పెద్ద పరిశ్రమ. సుమారు 5000 మంది కార్మికులు ఉపాధి కలిగిస్తుంది. గోనె సంచులు, ఇతర జనప నార ఉత్పత్తులు వీరి ఉత్పాదనలు.
గుప్తా గ్రూప్ - ప్రధానంగా ఎగుమతి వాణిజ్యం నిర్వహిస్తున్నారు. వెంట్రుకలు, తివాచీలు, ఇతర వ్యవసాయోత్పత్తులు.
రైస్ మిల్స్ (వరి మర ఆడించు) పరిశ్రమలు ఉన్నాయి.
ఇతరాలు - మిరప పొడి, పొగాకు, జీడిమామిడి, దినుసులు, ఉల్లి, పచ్చళ్ళు, మామిడికాయలు, బియ్యం వంటి వాటికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే లేక విక్రయించే సంస్థలున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏలూరులో భూ వ్యాపారం (రియల్ ఎస్టేట్) వృద్ధి చెందుతున్నది.
ఏలూరులో వ్యాపారం ప్రధానంగా పెద్దబజారులోను, సమీప ప్రాంతాల్లొనే కేంద్రీకృతమై ఉంది. రమామహల్ సెంటర్ ( అర్ అర్ పేట) రెండవ వాణిజ్య కేంద్రం అని చెప్పవచ్చును.
సోమవరపుపాడు వద్ద రిలయన్స్ ఉంది.
వట్లూరు వద్ద సూర్య మినరల్ వాటర్ ప్లాంటు ఉంది.
ఆటో నగర్ సవరించు
ఏలూరుకి ఆటో నగర్ నిర్మించాలని ఎప్పటి నుంచొ ప్రతిపాదన ఉన్నాయి. ఈ మద్య కాలంలోనే అది రూపుదిద్దుకుంది, ప్రస్తుతానికి కొన్ని చిన్న చిన్న వర్క్ షాప్ లు ఉన్నాయి. ఇది ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. ఆటో నగర్, ఆశ్రం ఆసుపత్రికి వెళ్లేదారిలో పెద్ద రైల్వే స్టేషనుకి చేరువలో ఉంది.

ఆలయాలు

శనివరపుపేటలోని శివాలయ గాలిగోపురం
ఏలూరు పట్టణానికి వేయి సంవ్సరాలకు పైబడి చరిత్రవుంది. అలానే ఇక్కడి ఆలయాల్లో కొన్నిటికి సహస్రాబ్దికి పైబడిన వయస్సువుంది. వెయ్యి సంవత్సరాలకు పైబడి చరిత్రవున్న ఆలయాల్లో రామలింగేశ్వరస్వామి ఆలయం, జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, జనార్దన కన్యకాపరమేశ్వరీదేవి గుడి, మార్కండేయాలయం, ఓంకారేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి.

జ్వలాపహరేశ్వర స్వామి వారి ఆలయం, దక్షిణపు వీధి (ఇది అత్యంత ప్రాఛీన ఆలయం)
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, పడమరవీధి (ప్రాచీన ఆలయం స్థాపితం : క్రీ.శ.1104) .
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, రామచంద్రరావు పేట
పాత శివాలయం, అగ్రహారం
సాయిబాబా గుడి, తూర్పు వీధి (ఇది అతి ప్రాచీన సాయిబాబా గుడి)
సాయిబాబా గుడి, విద్యా నగర్
శ్రీ నం దత్త క్షేత్రం, దొండపాడు (దత్త ఆశ్రమం) .
శ్రీ ఆది మహాలక్ష్మి అమ్మ వారి ఆలయం, పడమరవీధి
వెంకటేశ్వర దేవస్థానం, వెంకట్రావుపేట
హజ్రత్‌ సయ్యద్‌ బాయజీద్‌ మహాత్ముల వారి దర్గా, అగ్రహారం, కోటదిబ్బ.
నూకాలమ్మ గుడి, ఆదివారపు పేట.
శ్రీ మార్కండేయ స్వామి గుడి, దక్షిణపు వీధి
శ్రీ కోదండ రామాలయం (బొమ్మల గుడి), పట్టాభి రామాలయం (కణ్ణణ్ విలాస్), పడమరవీధి.
శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం.
శ్రీ అంబికాదేవి ఆలయం. 60 సం.క్రితం ఆలపాటి రామచంద్రరావు అనేభక్తుడు నిర్మించారు.
ఏలూరు దర్గ, కోట దిబ్బ మసీదు.
ఏలూరు సి.యస్.ఐ చర్చి.క్రైస్ట్ చర్చి, స్థాపితం 1864
ఏలూరు రొమన్ కాతలిక్ చర్చి, గ్జేవియర్ నగర్ (ఇది పురాతన మైనది) .
హోరేబు ప్రార్థనా మందిరం చర్చి (పవరు పేట) .
మన్నా చర్చి (శాంతి నగర్) .
మేరి మాత టవరు (వట్లూరు)
మేరి మాత టవరు, విద్యా నగర్
అవతార్ మెహెర్ బాబా సెంటర్, కట్టా సుబ్బారావు తోట
పరిసర ప్రాంతాలు, ఉత్సవాలు[ఉల్లేఖన అవసరం] సవరించు
ఏలూరు దర్గా ఉరుసు ఉత్సవాన్ని బాగా జరుపుతారు.
ఏలూరులో బుద్ధ విగ్రహం, గజ్జెలవారి చెరువు చూడముచ్చటగా ఉంటాయి.
ఏలూరు పండగ ప్రతి 10 సంవత్సరాలకోకసారి జరుపుతారు.
కొల్లేరు జాతర బాగా జరుగుతుంది.
ఏలూరు పరిసరాలలో ప్రాముఖ్యత కలిగిన లేదా చూడ దగిన విశేషాలు. వివరాలకు ఆయా వ్యాసాలను చూడండి.
కొల్లేరు సరస్సు ఆటపాక - 30 కి.మీ, కొల్లేటి కోట - 40 కి.మీ
ద్వారకా తిరుమల 40 కి.మీ
గుంటుపల్లె 40 కి.మీ
తడికలపూడి - గంగేశ్వరాలయం
రాట్నాలకుంట - రాట్నాలమ్మ తల్లి ఆలయం
"నం"దత్తనాధ క్షేత్రం, దొండపాడు ఏలూరు
ఏలూరులో దక్షిణపు వీధిలో అయ్యప్ప దేవాలయం ఉంది.
ఉత్సవాలు
వేంగి ఉత్సవం - ఇది పెదవేగి (వేంగి), ఏలూరు, పట్టిసీమలలో నిర్వహించబడుతుంది..
బలివే తిరుణాలు, బలివే
పెద్దింటమ్మ తిరుణాల్లు, కొల్లేటికోట
అచ్చమ్మ పేరంటాళ్ళు తిరణాలు, గాలాయగూడెం. మరెన్నో విశేషాలు తో....

07/05/2021

కాకినాడ విశిష్టతలు :

1) న్యూయార్క్ నగరము మాదిరిగా వీధులు రూళ్ళకర్రతో గీసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత.

2) ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ.

3) ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ మద్రాసుగానూ,

4) చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ ముంబయిగానూ,

5) ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్ గానూ,

6) భారతీయ ప్రామాణిక కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 82.5 ఉత్తర రేఖాంశం కాకినాడ మీదుగా పోతుంది.

7 ) సగటున కాకినాడ ఊరంతా సముద్రమట్టానికి 2 మీటర్లు ఎత్తులో ఉన్నప్పటికీ, పట్టణంలోని చాలా ప్రాంతాలు సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నాయి.

8 )సముద్రతీరానికి సమాంతరంగా, ఉత్తరం నుండి దక్షిణంగా ఒక దీర్ఘచతురస్రం మాదిరిగా నగరం ఉంటుంది.
😎 వస్త్ర వాణిజ్యం ఎక్కువగా జరిగిన ఈ ప్రాంతంలో డచ్చివారి కోట కూడా ఉండేది.

9) ఈ ప్రాంతంలో ఉన్న మడ అడవులు, భారతదేశంలో అతి పెద్ద మడ అడవులలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.

10) కోరంగి అభయారణ్యానికి నెలవు. గోదావరికి పాయలలో ఒకటైన 'గౌతమి', కాకినాడకి దక్షిణంగా బంగళాఖాతంలో కలుస్తోంది.

11) కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ (హోప్ ద్వీపం) చేత పరిరక్షింపబడుతున్నది.

12 ) రెండు శతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ నాయకర్‌ అనే ఆసామీ ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయన వారసులు మల్లాది సత్యలింగ నాయకర్‌ ఛారిటీస్ (MSN Charities) అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారు.

13) ఇక్కడి జె ఎన్ టి యు కళాశాల భారదేశంలోని అతి పురాతనమైన, అత్యుత్తమమైన ఏలెక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ శాఖలను కలిగి ఉంది.

14 ) నిజాం కాలంనాటి ప్రధాన రైలు, “సర్కార్ ఎక్స్ ప్రెస్” ఇప్పటికీ, కాకినాడ – చెన్నై ల మధ్య నడుస్తోంది.

15 ) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్ వైమానిక దళం, కాకినాడ మీద 1942 ఏప్రిల్ 6న దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఓడలు పూర్తిగా ధ్వంసం కాగా, ఒకరు మృతి చెందారు.

16 ) నాగార్జున ఎరువుల కర్మాగారం (కోస్తా ఆంధ్రలో అత్యధికంగా యూరియా ఉత్పత్తి చేసే కేంద్రం) ,కో రమాండల్ ఎరువుల కర్మాగారం (డై అమ్మోనియం హైడ్రోజన్ ఫాస్పేట్ ఉత్పత్తి జరుగుతోంది అందుకే కాకినాడని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు "ఎరువుల నగరం (Fertilizer City)"గా కూడా పిలుస్తారు

17 ) కాకినాడ పరిసర ప్రాంతాల నుండి, కొబ్బరికాయలను ఎగుమతి చేసే సంస్థలు చాలా ఉన్నాయి.

18 ) మురుగప్ప గ్రూపువారి ఈద్ పారీ (ఇండియా) మరియు కేర్గిల్ ఇంటర్నేషనల సంస్థల ఉమ్మడి పంచదార కర్మాగారం అయిన సిల్క్ రోడ్ సుగర్స్, 600,000 టన్నుల సామర్థ్యం కలది. ఇది, ప్రధానంగా ఎగుమతి ఆధార పరిశ్రమ(Export Oriented Unit)

19 ) 2002 సంవత్సరంలో, కాకినాడ పరిసరాల్లో అనేక వంటనూనె కర్మాగారాలు స్థాపించబడ్డాయి. అదానీ విల్మార్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, నిఖిల్ రిఫైనరీ, భగవతి రిఫైనరీ, మొదలైనవి రోజుకి 3000 టన్నులకి పైగా వంటనూనెలను ఉత్పత్తి చేయగలవు. ఈ కర్మాగారాలకి అవసరమైన ముడి పామాయిల్, సోయాబీన్ నూనె, ఓడరేవునుండి దిగుమతి అవుతున్నాయి

20 ) నాణ్యమైన జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు వాడే ఈ జత్రోఫా పంటని సాగుచేసేందుకు, కాకినాడ పరిసరాల్లో 200 ఎకరాలను కంపెనీ సేకరించింది.

21 ) కాకినాడ పరిసర ప్రాంతాలలో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు చాలా ఉన్నాయి. ఉప్పాడ బీచ్ రోడ్డునందు, స్పెక్ట్రం పవర్ జనరేషన్ సంస్థకి 208 మెగావాట్ల కేంద్రం ఉన్నది.

22 ) ఆంధ్రప్రదేశ్ ఐ.టీ పరిశ్రమలో కాకినాడ ద్వితీయ శ్రేణి నగరంగా పరిగణింపబడుతోంది.

23 ) ఉభయ గోదావరి జిల్లాల్లోని ఐ.టీ కంపెనీల సంఘం అయిన "గోదావరి ఐ.టీ అసోసియేషన్" (GITA), కాకినాడ కేంద్రంగా పనిచేస్తోంది

24 ) 2012-13 సంవత్సరంలో కాకినాడ నుండి రూ 35 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరిగాయి. ఈ ఎగుమతులలో హైదరాబాదు, విశాఖపట్నం తర్వాత కాకినాడది మూడో స్థానం

25 ) కాకినాడలో ఉన్న ఆంధ్రా ఎలక్ట్రానిక్స్ లి. సంస్థ, 1977 నుండి ఎలక్ఱ్రానిక్ వస్తువులను తయారుచేస్తోంది.

26 ) ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరింగు కళాశాల. జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇంజనీరింగు కళాశాల (JNTU Engineering College).

27 ) కాకినాడలో వున్న ప్రఖ్యాత మెక్లారెన్ స్కూలు వంద సంవత్సరాల చరిత్ర గలది.

28 ) ఆసియా లో మొదటి బయో డీజల్ తయారి ఇక్కడ కలదు.

29 ) కాకినాడ పరిసరాల్లోని సామర్లకోట గ్రామంలో ఉత్తరాయణం - దక్షిణాయనం మధ్య కాలంలో శ్రీభవన్నారాయణస్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు.

30 ) పావులూరి మల్లన - 11వ శతాబ్దానికి చెందిన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. గణితసార సంగ్రహము అనె గణితగ్రంధాన్ని వ్రాశాడు. దీనికే పావులూరి గణితము అని పేరు.
మల్లాది సత్యలింగం నాయకర్- 19వ శతాబ్దానికి చెందిన వాణిజ్యవేత్త, సంఘసేవకుడు.

31 ) కాకినాడ ఊరు పేరు చెప్పగానే నోరూరే విషయాలు రెండు. ఒకటి కోటయ్య కాజాలు. ఇవి తాపేశ్వరం మడత కాజాల వంటి కాజాలు కావు. సన్నంగా, కోలగా దొండకాయలాగా ఉంటాయి. , కొరగ్గానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తుంది. వీటిని గొట్టం కాజాలని కూడా అంటారు. తరువాత చెప్పుకోవలసినది నూర్జహాన్ కిళ్ళీ. ఇది తుని తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళీ. అలాగే కాకినాడలోని సుబ్బయ్య హోటలు. సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే ఇక్కడి అద్భుతమయిన భోజనానికి చాల ప్రశస్తి ఉంది.

32 ) డీప్ వాటర్ పోర్ట్ నిర్మించక ముందు నుండీ ఉన్న కాకినాడ లంగరు రేవు, భారతదేశంలోని 40 చిన్న ఓడరేవులలో అతిపెద్దది.

Address

Fire Station Center
Eluru
534002

Opening Hours

Monday 9am - 11:30pm
Tuesday 9am - 11:30pm
Wednesday 9am - 11:30pm
Thursday 9am - 11:30pm
Friday 9am - 11:30pm
Saturday 9am - 11:30pm
Sunday 9am - 11:30pm

Telephone

9440261557

Website

Alerts

Be the first to know and let us send you an email when Murali Krishna Travels Eluru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Murali Krishna Travels Eluru:

Videos

Share

Category


Other Tour Agencies in Eluru

Show All