మన దేవాలయాలు

మన దేవాలయాలు Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from మన దేవాలయాలు, Tour guide, Hyderabad.
(38)

Manatemples.in is a website which gives complete information of temples of Telangana and Andhra Pradesh.

temples





తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అన్ని స్వయం భు దేవాలయాలు(చిన్న,పెద్ద) మరియు పురాతన దేవాలయాలు అన్నింటిని ఒకే దగ్గర కనిపించేలా చేసి వాట

ిని వేలుగోలోకి తీసుకోని రావలని.. ఎవరికి తెలియని చాల పురాతన దేవాలయాలు ను అందరికి తెలుస్తాయి అన్న మంచి ఉద్దెశ్యం తో మేము చేస్తున్న చిన్న ప్రయత్నం!! ఈ మా చిన్న ప్రయత్నం లో ఏవైనా అక్షర దోషాలు ఉన్న, సమాచారం లో ఏదైనా లోపాలు ఉన్న పెద్ద మనసుతో మీరు మన్నించి మాకు సరి ఆయన సమాచారం అందిస్తారు అని మా మనవి .

మీరు మీ చుట్టూ ప్రక్కల ఏవైనా పురాతన దేవాలయాలు ఉంటె దయచేసి వాటికీ సంబందించిన వివరాలు మరి వాటికీ సంబందించిన చిత్రాలు తీసి [email protected] కి పంపించగలరు అని ప్రార్ధన!!

03/07/2024

బుధవారం ను పురస్కరించుకొని మా అంజనేయ క్షేత్రంలో రాకంచేర్ల భజన కార్యక్రమాలూ

29/06/2024

శనివారం ను పురస్కరించుకుని మాఆంజనేయ క్షేత్రం లో

28/06/2024

యువత ను సరి అయినా దారిలో నడిపించే మంచి ఆయుధం ఆధ్యాత్మికత,దేశ భక్తి,ధర్మ ప్రచారం …

22/06/2024

శనివారం ఏరువాక పౌర్ణమి ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పూడురు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో కొలువైన ఆంజనేయ స్వామి క్షేత్రం లో

అందరికీ  శుభసాయంత్రంఅంజనేయ స్వామీ దేవాలయం లో నేడు శనివారం ను పురస్కరించుకొని స్వామి వారికి అభిషేకం,తమలపాకుల పూజా ,ఆస్టోత...
15/06/2024

అందరికీ శుభసాయంత్రం

అంజనేయ స్వామీ దేవాలయం లో నేడు శనివారం ను పురస్కరించుకొని స్వామి వారికి అభిషేకం,తమలపాకుల పూజా ,ఆస్టోత్తర శతనామావళి తో నిర్వహించడం జరిగింది.

స్వామి వారి ఆశీస్సులు అందరి పైన చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ..

ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా సమయానికి పడి పంటలు బాగా పండి గిట్టుబాటు ధర లభించి రైతులు సంతోషంగా ఉండాలని స్వామి వారికి జలాభిషేకం నిర్వహించడం జరిగింది.

గ్రామం లో ఉన్న అన్ని
దేవాలయాలలో భక్తి శ్రద్ధలతో జలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

గ్రామం: పెద్ద ఉమ్మెంతాల్
మండలం పూడూరు
జిల్లా:- వికారాబాద్

ఇట్లు
గిరి పంతులు

12/06/2024

బుధవారం ను పురస్కరించుకుని మా ఆంజనేయ క్షేత్రం లో భజన కార్యక్రమాలు…

08/06/2024

శనివారం ను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో కొలువైన ఆంజనేయ క్షేత్రం లో …

01/06/2024

హనుమద్జయంతి ని పురస్కారుంచుకొని మా అంజనేయా క్షేత్రం లో

31/05/2024

రేపు హనుమాజ్జయంతిని పురస్కరించుకొని మా ఆంజనేయ క్షేత్రం లో స్వామి వారికి సింధూర,పంచామృత అభిషేకం మొదలగు విశేషమైన పూజాధికార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.అందరూ ఆహ్వానితులే!

31/05/2024

రేపటినుండి మన దేవాలయాలు ద్వార 20 పురాతన దేవాలయాలకు ధూపదీప నైవేద్య సామగ్రి అందించడం జరుగుతుంది.మీరు ఇ గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకోండి!

నమస్తేశనివారం ను పురస్కరించుకొని (25.05.2024 ) ఆంజనేయ క్షేత్రం లోస్వామి వారికి అభిషేకం,పంచామృత అభిషేకం,తమలపాకుల పూజా, తు...
27/05/2024

నమస్తే

శనివారం ను పురస్కరించుకొని (25.05.2024 ) ఆంజనేయ క్షేత్రం లో
స్వామి వారికి అభిషేకం,పంచామృత అభిషేకం,తమలపాకుల పూజా, తులసీదళ అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

పూజది కార్యక్రమాలు ముగిసిన తరువాత తీర్థ ప్రసాద వితరణ చేయడం జరిగింది.

సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం,మహా మంగళహారతి ఇవ్వడం జరిగింది.

స్వామి వారి కృపా కటాక్షములు మీ అందరి పైన చల్లగా ఉండాలని ప్రార్థించడం జరిగింది.

దేవాలయం లో జరుగుతున్న అభిరుద్ధి పనులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు అని కోరుకుంటూ..మీరు చేసే సహాయం దేవాలాయా అభిరుద్ధి కి,భక్తులకు ఎంతో తోడ్పాటు ను అందిస్తుంది.

ఇట్లు
గిరి పంతులు

 #మనదేవాలయాలు_మనవారసత్వసంపద  #మనదేవాలయాలు  #రాకంచెర్ల  యోగానంద లక్ష్మి నరసింహుని బ్రహ్మోత్సవాలు నేటి నుండి మొదలు!!చీమలు ...
22/05/2024

#మనదేవాలయాలు_మనవారసత్వసంపద
#మనదేవాలయాలు
#రాకంచెర్ల


యోగానంద లక్ష్మి నరసింహుని బ్రహ్మోత్సవాలు నేటి నుండి మొదలు!!

చీమలు మలిచిన యోగనంద నరసింహ స్వామి క్షేత్రం,రాకంచెర్ల
----------------------------------------------

హైదరాబాద్ నుండి పరిగి వెళ్లే మార్గంలో రాకంచెర్ల అనే గ్రామం లో ఒక చిన్న గుట్ట పైన చీమలు ఒక రాయని యోగానంద నరసింహుని గా మలిచిన క్షేత్రం..కొన్ని వందల సంవత్సరాల చరిత్రగల దేవాలయం..

వాగ్దేయకరుడు రాకంచెర్ల వెంకట దాసుల వారు ఇ క్షేత్రాన్ని అనుసంధానంగా చేసుకొని శ్రీ హరిని స్తుతిస్తూ కొన్ని వేల కీర్తనలను రాసారు.ప్రస్తుతం వాటిలో 500 కి పైగా పుస్తక రూపం లో అందుబాటులో ఉన్నాయి..ఆ కీర్తనలను ఇ ప్రాంతంలో అన్ని దేవాలయాలలో,ఉత్సవాలలో భజనల రూపం లో పాడుతారు.శ్రీ హరిని మెప్పించిన చరిత్ర మరిచిపోయిన గొప్ప వాగ్దేయకరుడు రాకంచెర్ల వెంకట దాసుల వారు.

ఎలా వెళ్ళాలి: హైదరాబాద్ నుండి పరిగి వెళ్లే మార్గం లో ప్రధాన రహదారికి అనుకోనే రాకంచెర్ల అనే గ్రామం లో ఇ క్షేత్రం కొలువై ఉంది.

Lord Yogaananda Laxmi Nrusimha swamy temple is located in Rakamcherla village. It is 68 km away from Hyderabad and 13 km away from Pargi town. This place can be reached by RTC bus from Pargi, Hyderabad and Vikarabad. The place is famous for its scenic beauty. A Stream flows nearby the temple and there is a mango garden with about 1000 varieties of groves in it. One can have darshan of the lord by climbing about 150 steps.
The temple is located on a small hillock and the Deity is said to be very powerful. The Idols of the Lord Nrusimha made by Black ants and not by any human being. These ants can be seen at the feet of the Lord throughout the year .Rathostava is performed on Pournami of Visakha Maasa every year. Thousands of devotees participate in the Utsava and worship the Lord.
Saint Venkatadaasa worshipped the Lord and composed thousands of the Keertanas which are as famous as that of other keerthanas. His Vigraha can be seen on the right side of the lord. There are several other small temples at the feet of the hillock.
Anjaneya Swamy temple
Panduranga Swamy Temple

#రాకమచెర్ల
#రాకమచెర్లవెంకటదాసులవారు
#రాకమచెర్లయోగనందనరసింహాస్వామిదేవాలయం
#వెంకటదాసులవారికీర్తనలు
#రాకమచెర్లభజనకీర్తనలు

రాకంచెర్ల వెంకట దాసుల వారు: Rakamcherla Venkata Dasula Vaaru
--------------------------------------------

రాకమచెర్ల వెంకట దాసుల వారు గొప్ప వాగ్దేయకారుడు.అన్నమాచార్యులు,రామదాసు అంత గొప్ప చరిత్రకారుడు,జ్ఞాని,భక్త సులబుడు.
తన జీవితమంతా హరినామ స్మరణతో జీవితం గడిపి ప్రజలలో దైవ చింతన,భక్తితో మేల్కొలుపే వాడు.

వెంకటదాసుల వారు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పుడూర్ మండలం లో గల రాకమచెర్ల గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని ఒక పీఠాన్ని స్థాపించి తన జీవితాన్ని దైవం లో లీనం చేశారు.చీమలు ఒక రాయిని యోగనంద నర్సింహుని గా మలిచాయి.కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దివ్య క్షేత్రమిది.

కొన్ని వేల కీర్తనలను అయిన రాసినారు.దాంట్లో కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటికి మా స్వగ్రామం లో ఉన్న తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు అయిన రాసిన కీర్తనలను భజన గా చేస్తూ స్వామి వారి సేవ కార్యక్రమలు నిర్వహిస్తారు.

ప్రతి ఒక్కరు ఇ క్షేత్రాలను దర్శించి స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు.

తెలంగాన సాంస్కృతిక శాఖ వాళ్ళు బాగా అధ్యయనం చేసి చరిత్ర మరిచిపోయిన గొప్ప వాగ్దేయకారుడిని ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేయాలి.

గమనిక; మిత్రులందరికీ విజ్ఞప్తి ప్రతి ఒక్కరు మంచి విషయాన్ని అందరితో పంచుకొని ఒక గొప్ప వాగ్గేయకారుడు/గొప్ప క్షేత్రం గురుంచి ప్రపంచానికి తెలియ చేసే ప్రయత్నం చేద్దాం!



మీ శ్రేయోభిలాషి
గిరీష్

 #మనదేవాలయాలు_మనసంపద #మనదేవాలయాలు #దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి #భక్తప్రహాలధనరసింహ జయంతి ప్రత్యేకం:-ధర్మం దారి త...
22/05/2024

#మనదేవాలయాలు_మనసంపద
#మనదేవాలయాలు
#దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి
#భక్తప్రహాలధ

నరసింహ జయంతి ప్రత్యేకం:-

ధర్మం దారి తప్పినప్పుడు,అధర్మం ధర్మమైనప్పుడు శ్రీమన్నారాయణుడు తప్పకుండా ఏదో ఒక రూపం లో వస్తారు .ధర్మాన్ని,ధర్మన్నీ కాపాడే వాళ్ళను తప్పకుండా కాపాడుతారు.. కాపాడాలి కూడా అది సృష్టి ధర్మం..
కొడుకు విష్ణుభక్తితత్పరతను మానిపించలేక విసిగిపోయిన హిరణ్యకశిపుడు ఆవేశంతో ‘నీ దేవుడు ఎక్కడున్నాడురా?’ అని అడగ్గా, అందుకు ప్రహ్లాదుడు

ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే

అని బదులు చెప్పగా, ‘అయితే, నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా?’ అని ఆ స్తంభాన్ని ఒక్క తన్ను తన్నాడు. అప్పుడా స్తంభం విచ్చిపోగా, అందులో నుంచి ఉగ్రనరసింహమూర్తి బయల్వెడలి హిరణ్యకశిప సంహారాన్ని చేస్తాడు.ఇక్కడ స్తంభం అంటే నిశ్చలతత్త్వం. నిరంతర భగవచ్చిం తన వలన జ్ఞానం, కర్మరహితమైన నిశ్చలతత్వానికి చేరుతుంది. అప్పుడు అద్భుతత్వం సిద్ధిస్తుంది. అదే స్తంభం నుంచి నృసింహస్వామి అవతరించడం.
న‘హింసా’యాం - అంటే నశింపజేసే హింస.
సింహా - కనుక నశింపజేసేదానిని నశింపజేసేది. అంటే జీవుని నాశనం చేసే ఐహిక, భోగ, దుఃఖకారణమైన విషయ లోలత్వాన్ని నశింపజేసే మోక్షస్థితే నృసింహావతారం.

అందుకే నృసింహ స్వామి తాపత్రయాలను నివారించి ముర్తినిచ్చే అవతారం. తన భక్తుల పరాజయాన్ని సమ్మతించలేని అపార కరుణాకటాక్ష వీక్షణానికి ఈ అవతారం ఓ సాక్ష్యం!

మి శ్రేయోభిలాషి
గిరీష్

22/05/2024

బంధు మిత్రులందరికీ శ్రీ లక్ష్మీనృసింహ జయంతి శుభాకాంక్షలు...
!!ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం!
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం!!

అందరికీ  శుభమధ్యాహ్నంఅంజనేయ స్వామీ దేవాలయం లో శనివారం ను పురస్కరించుకొని స్వామి వారికి అభిషేకం,తమలపాకుల పూజా ,ఆస్టోత్తర ...
04/05/2024

అందరికీ శుభమధ్యాహ్నం

అంజనేయ స్వామీ దేవాలయం లో శనివారం ను పురస్కరించుకొని స్వామి వారికి అభిషేకం,తమలపాకుల పూజా ,ఆస్టోత్తర శతనామావళి తో నిర్వహించడం జరిగింది.

స్వామి వారి ఆశీస్సులు అందరి పైన చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ..

గ్రామం: పెద్ద ఉమ్మెంతాల్
మండలం పూడూరు
జిల్లా:- వికారాబాద్

ఇట్లు
గిరి పంతులు

20/04/2024

శనివారం ను పురస్కరించుకుని మా ఆంజనేయ క్షేత్రం లో స్వామి వారికి పంచామృత అభిషేకం,తమలపాకుల పూజ మొదలగు సేవ లు చేయడం జరిగింది.

నమస్కారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో కొలువైన ఆంజనేయ స్వామి దేవాలయం సుమారు 7 దశాబ్దాల చరిత్...
19/04/2024

నమస్కారం

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో కొలువైన ఆంజనేయ స్వామి దేవాలయం సుమారు 7 దశాబ్దాల చరిత్ర కలిగిన శక్తివంతమైన ఆంజనేయ క్షేత్రం..గ్రామానికి చివర్లో వాగు గట్టు పైన స్వయం భు గా వెలిసి ప్రతినిత్యం మా కుటుంబీకుల చే పూజలందుకుంటున్న దివ్యమైన క్షేత్రం..కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం స్వామి..

ఆంజనేయ స్వామి దేవాలయం లో హనుమాన్ జయంతి (విజయోత్సవ యాత్ర) కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని భగవత్ సంకల్పం...

హనుమాన్ జయంతి రోజు జరుగు కార్యక్రమాలు(23-04-2024)

ఉదయం:-

1.ఆంజనేయ స్వామి కి సిందురాభిశేకం, తమలపాకుల పూజా

2.శ్రీ సీతా రామచంద్రస్వామి, లక్ష్మణ స్వాములకు పంచామృత అభిషేకం

3.పావమన హోమం

4.తీర్థ ప్రసాదాలు ,అన్న దానం వితరణ

సాయంత్రం :-

5.గ్రామం అంతా స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో భజన కార్యక్రమాలతో ఊరేగుంపు కార్యక్రమం

6.మహా మంగళహారతి
7.అన్నదాన వితరణ కార్యక్రమం

ప్రతీ ఒక్కరూ హనుమాన్ జతంతి మహోత్సవం లో పాల్గొని స్వామీ వారి కృపా కటక్షాలకు పాత్రులు కాగలరని మనవి.

దాతల గోత్ర నామాలతో పవమన హోమం రోజు ప్రత్యేక అర్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది.

గొప్ప కార్యక్రమానికి
మీ వంతు చేయూత అందించాల్సిందిగా మనవి.

ఇట్లు
ఆలయ అర్చకులు
వెంకట గిరి చార్యులు
91-9866933582

అందరికీ  నమస్కారంఅంజనేయ స్వామీ దేవాలయం లో నిన్న శనివారం (13.04.2024) ను పురస్కరించుకొని స్వామి వారికి అభిషేకం,తమలపాకుల ప...
14/04/2024

అందరికీ నమస్కారం

అంజనేయ స్వామీ దేవాలయం లో నిన్న శనివారం (13.04.2024) ను పురస్కరించుకొని స్వామి వారికి అభిషేకం,తమలపాకుల పూజా ,ఆస్టోత్తర శతనామావళి తో నిర్వహించడం జరిగింది.

స్వామి వారి ఆశీస్సులు అందరి పైన చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ..

ఇట్లు
గిరి పంతులు

10/04/2024

బుధవారం ను పురస్కరించుకుని మా ఆంజనేయ క్షేత్రం లో భజన కార్యక్రమాలు

09/04/2024

భగవత్ బంధువులందరికీ "క్రోధి" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!లక్ష్మి హనుమ కృపాకటక్షములు అందరి పైన చల్లగా ఉండాలని కోరుకుంటూ..

03/04/2024

బుధవారం ను పురస్కరించుకుని మా ఆంజనేయ క్షేత్రం లో రాకంచెర్ల భజన కార్యక్రమము..

30/03/2024
25/03/2024

500 సంవత్సరాల చరిత్ర కలిగిన రాకంచెర్ల యోగానంద నంద నరసింహ క్షేత్రం పునర్నిర్మాణం కోసం కూల్చేసి సంవత్సర కాలం దాటిపోయింది..ఇప్పటికీ ఒక అడుగు కూడా ముందుకు పోలేదు..ప్రాంత నాయకులు స్పందించి పనులు మొదలు అయ్యేలా చూడాలి!!

25/03/2024

సమూహం లో ఉన్న భగవత్ బంధువులందరికీ హోళికా పౌర్ణమి
శుభాకాంక్షలు!లక్ష్మి నారాయణుల కృపా కటాక్షములు అందరి పైన చల్లగా ఉండాలనీ కోరుకుంటూ…

అందరికీ  శుభ సాయంత్రంఅంజనేయ స్వామీ దేవాలయం లో నేడు శనివారం ను పురస్కరించుకొని స్వామి వారికి సింధూర అభిషేకం,తమలపాకుల పూజా...
23/03/2024

అందరికీ శుభ సాయంత్రం

అంజనేయ స్వామీ దేవాలయం లో నేడు శనివారం ను పురస్కరించుకొని స్వామి వారికి సింధూర అభిషేకం,తమలపాకుల పూజా ,పంచామృత అభిషేకం,ఆస్టోత్తర శతనామావళి తో నిర్వహించడం జరిగింది.

స్వామి వారి ఆశీస్సులు అందరి పైన చల్లగా ఉండాలని ప్రార్టిస్తు..

మీ మీ పుట్టిన రోజులు,వివహా వార్షికోత్సవ సందర్బాలు ముందుగా తెలియచేస్తే స్వామి వారికి విశేషమైన పూజది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

ఇట్లు
గిరి పంతులు

 #రామలక్ష్మణులు నిరాయుదులుగా ఆయుధాలు లేకుండా దర్శనమిచ్చే చాలా అరుదైన దేవాలయం మన తెలుగునాట..ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శిం...
20/03/2024

#రామలక్ష్మణులు నిరాయుదులుగా ఆయుధాలు లేకుండా దర్శనమిచ్చే చాలా అరుదైన దేవాలయం మన తెలుగునాట..

ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన దివ్యమైన క్షేత్రం..ప్రతి ఒక్కరు తప్పకుండా షేర్ చేయండి..అందరికి తెలిసేలా చేయండి.

బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం,పుల్లగుమ్మి గ్రామం,వెల్దుర్థి మండలం,కర్నూల్ జిల్లా
----------------------------------------------------------

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రామ లక్ష్మణులు నిరాయుదులుగా ఆయుధాలు లేకుండా అంటే ధనుస్సు బాణాలు లేకుండా దర్శనం ఇస్తారు సీతరామ లక్ష్మణ హనుమంతులవారు ఏక శిలపై వున్నారు .

కర్నూల్ జిల్లా వెల్దుర్థి మండలం #పుల్లగుమ్మి గ్రామం లో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం #బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయం.

దాదాపు 500సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం నిరంతరాయంగా భూమినుండి ఉబికివస్తున్న గంగమ్మ ఉత్తర పచ్చిమ దిశల్లో ప్రవహిస్తుంది.ఇక్కడ స్వామి వారికి అర్ధరాత్రి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది.

మీ శ్రేయోభిలాషి
గిరీష్

      రామలింగేశ్వర స్వామి దేవాలయం –దామగుండం--------------------------------------------------------భాగ్యనగరానికి  65 కి ...
20/03/2024





రామలింగేశ్వర స్వామి దేవాలయం –దామగుండం
--------------------------------------------------------
భాగ్యనగరానికి 65 కి మీ దూరం లో పరిగి వెళ్ళే మార్గం లో పూడూర్ మండల కేంద్రానికి 2 కి మీ దూరం లో వెలసిన ప్రసిద్ది విష్ణు అనుసందమైన శైవ క్షేత్రం దామగుండా క్షేత్రం !దామగుండా దర్శనం మోక్ష దాయకం మరియు యమగండం ఉండదు అని చెబుతారు .ఈ క్షేత్ర మహత్యాన్ని స్కంద పురాణం లో వివరించడం జరిగింది.

ప్రాదాన ఆలయానికి ఎదురుగా గరుత్మంతుని దర్శనం లబిస్తుంది . ఆలయానికి సమీపం లో ఉన్న పుష్కరిణి(దామ సరోవరం ) లో స్నానం అచారిస్తే సర్వ రోగ నివారని అని చెబుతారు . దట్టమైన అడువుల మద్య వెలసిన ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . కాకతీయుల కాలం లో నిర్మించినట్లు శాసనాల ద్వార తెలుస్తుంది .

శ్రీ రామ చంద్ర మూర్తి ప్రతిష్టించిన కోటి శివ లింగాలాలో ఇది కూడా ఒకటి అని చెబుతారు .అందుకే ఈ క్షేత్రానికి రామలింగేశ్వర క్షేత్రం అని పూర్వ కాలం లో నీలకంటశ్రమం అని కూడా పిలిచేవారట ! పూర్వం ఎంతో మంది మహర్షులు ఈ క్షేత్రం లో తపస్సు చేసుకునే వారట ఇప్పటికి మనకు ఆ ఆదారాలు ,గుహలు కనిపిస్తాయి . అల మునులు ,ఋషులు చే ఆరదించబడిన లింగం భూమిలో అంతర్దానమై కలియుగం లో దాముడు,గుండడు అనే వ్యవసాయదారుల పొలం లో ఉద్బావించాడు. వారు దానిని సామాన్య శీలా గ బావించి నాగలికి బరువుగా పెట్టి దున్నేవారు .స్వామి వారు వారిద్దరికీ స్వప్నం లో సాక్షాత్కరించి ఆ లింగ వృత్తాంతమును వివరించి అక్కడే ఉన్న సరోవరానికి ఎదురుగా ప్రతిస్టించమని వారి ఇద్దరి పేర్ల ఆదారంగనే క్షేత్రానికి దామగుండం అని పేరు వచ్చింది అని స్థల పురాణం చెబుతుంది .

గ్రహ బాద నివారణకు , సర్వ రోగ నివారణకు ఈ క్షేత్రాన్ని తప్పకుండ దర్శించి తీరాలి !
వెళ్ళు మార్గం :- హైదరాబాద్ నుండి పరిగి వెళ్ళు మార్గం లో పూడూర్ మండల కేంద్రానికి 2 కి మీ దూరం లో ఉంటుంది .

మీ శ్రేయోభిలాషి
గిరీష్

20/03/2024

ప్రతి ఒక్కరూ మన దేవాలయాలు పోస్టులు షేర్ చేసే ప్రయత్నం చేయండి..అందరికీ సమాచారం తెలుస్తుంది,తెలియ చేసే ప్రయత్నం చేద్దాం!!

సప్తముఖ ఆంజనేయ స్వామి దేవాలయం -లోంక క్షేత్రం,పరిగి,వికారాబాద జిల్లా  ----------------------------------------------హైదరా...
20/03/2024

సప్తముఖ ఆంజనేయ స్వామి దేవాలయం -లోంక క్షేత్రం,పరిగి,వికారాబాద జిల్లా
----------------------------------------------

హైదరాబాద్ నుండి సుమారు 70 కి మీ దూరం లో ఒక చిన్న గ్రామం లో వెలసినా మహిమన్మితమైన ఆంజనేయ క్షేత్రం . వికారాబాద జిల్లా లోని పరిగి పట్టనణానికి సమీపం లో కాలాపూర్ అటవి ప్రాంతం లో వెలసిన శక్తి వంతమైన హనుమాన్ క్షేత్రం .త్రేతా యుగం లో శ్రీ రాముడు,సీత దేవి,లక్ష్మణుడు తిరిగినట్లు పురాణాల్లో వివరించడం జరిగింది .

సప్త ముఖ ఆంజనేయ స్వామి దేవాలయం లో ఏడు రాతి పలకలకు చందనం తో అలంకరిస్తారు. ఆలయానికి ముందు బాగం లో చిన్న పుష్కరిణి ఉంది అక్కడ స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటే సకల రోగాలు ,ధరిద్రాలు పోతాయని భక్తుల విశ్వాసం. పవిత్రమైన ఈ ప్రదేశం లో ఎల్ల కాలం నిటి ప్రవాహం ఉన్నందు వలన సప్త వ్రుషులు తపస్సు చేసారని పురాణం గాథ !! ఒకప్పుడు ఇ ప్రాంతమంతా దట్టమైన చెట్లతో అడవిలా ఉండేది. సప్త వ్రుషులకు స్వామి వారు ప్రత్యక్షమై ఇక్కడే సంచరిస్తూ ఉంటాను అని అభయం ఇచ్చాడు అని పురాణం గాథ !!

వెళ్ళు మార్గం : హైదరాబాద్ నుండి పరగి వెళ్ళే మార్గం లో రంగాపూర్ అనే గ్రామానికి అతి సమీపం లో ఈ క్షేత్రం ఉంటుంది !!

 #మనదేవాలయాలు_మనసంపద  #మనదేవాలయాలు  #దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి వెంకటేశ్వర స్వామి దేవాలయం-ఘనపూర్ ,వెంకటేశ్వర గ...
20/03/2024

#మనదేవాలయాలు_మనసంపద
#మనదేవాలయాలు
#దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి

వెంకటేశ్వర స్వామి దేవాలయం-ఘనపూర్ ,వెంకటేశ్వర గుట్ట
----------------------------------------------------------

సికింద్రాబాద్ నుండి సుమారు 25-30 కి మీ దూరం లో ఉన్న ఘనపూర్ గ్రామం లో గుట్ట ( షామీర్ పేట కి సమీపం లో ) పైన వెలసిన వెంకటేశ్వర స్వామి దేవాలయం చాల పురాతనమైనది . గుట్ట పైన ఒక రాయి పైన స్వామి వారు స్వయం భు గా వెలిశారు . ప్రశాంతమైన వాతవరణం ,చుట్ట అందమైన పచ్చదనం మనకు ఎంతో ఆహ్లాదాన్ని ,ఆధ్యాత్మికత భావనలోకి తీసుకెళ్తుంది . అలవేలు మంగా ,పద్మావతి సమేతంగా కొలువై ఉన్నారు ఇక్కడ స్వామి వారు కొలువై ఉన్నారు.

స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న రెండు పెద్ద రాళ్ల మద్య లో వీరభద్ర స్వామి కొలువై ఉన్నాడు స్వామి వారి ఆలయానికి ప్రక్కనే ఉన్న మరో ఒక రాయి పైన పుర్వము ఒక మహర్షి నిలబడి తపస్సు చేసాడని స్థల పురాణం .

ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయం లో స్వామి వారికి ఉత్సవాలు నిర్వహించాబడుతాయి . ఆ సమయం లో చాల మంది భక్తులు పాల్గుంటారు .

ఆలయం దిగువ బాగాన నవగ్రహ దేవాలయాలు ఉన్నాయి . ఇక్కడ నిర్మించిన దేవాలయాల్లో నవగ్రహాలు సతి సమేతంగా ప్రతిష్టిన్చబడ్డాయి . నవగ్రహ దేవాలయాలతో పాటు
శివాలయం
గణపతి దేవాలయం
నాగదేవత ఆలయం
ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి .

గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడ దోష పరిహారార్థం శాంతి పూజలు, హోమాలు ,ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు . ప్రతి ఒక్కరు తప్పకుండ ధర్సించనీయమైన క్షేత్రం ఇది .

కాల భైరవ స్వామి దేవాలయం -భైరవగుట్ట
--------------------------------------------------

ఘనపూర్ గుట్ట నుండి గండి మైసమ్మ వచ్చే మార్గం లో రావాలకోలే గ్రామం లో ఒక ప్రైవేటు ఫార్మ్ హౌస్ లో గుట్ట పైన వెలసిన కాలభైరవ స్వామి చాల శక్తివంతమైన దైవం . ఆలయ ఆవరణ ప్రాంగమ లో శనీశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు .

ప్రతి శని వారాల్లో , శని త్రయోదశి కి ప్రత్యేకించి ఇక్కడికి భక్తులు తండోప తన్దలగు వస్తు ఉంటారు .
చాల మహిమన్మితమైన క్షేత్రం . గ్రహదోష లు ఉన్న వాళ్ళు తప్పకుండ దర్సిన్చానియమైన స్థలం .
శని త్రయోదశి సందర్భంగా తైలబిషేకం నిర్వహిస్తార్రు .

మీ శ్రేయోబిలాషి
గిరీష్

Address

Hyderabad
500081

Alerts

Be the first to know and let us send you an email when మన దేవాలయాలు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to మన దేవాలయాలు:

Videos

Share

Category

Nearby travel agencies



You may also like