09/04/2024
Srishailam Dudam Independent Journalist Jagtial Dist:9441271777 ది టార్గెట్ న్యూస్... జగిత్యాల జిల్లా ఏప్రిల్ 16 మందికి జాతీయ సమైక్యతా పురస్కారాలు. జగిత్యాల ఏప్రిల్9:క్రోధీ నామసంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యలయంలో ఉగాది సంబరాలు నిర్వహించారు. ఉగాది పచ్చడి,బూరెలు పంపిణీ చేశారు.అనంతరం జాతీయ సమైక్యతకు కృషి చేస్తున్న జిల్లాలోని 16 మంది పెన్షనర్లకు,సీనియర్ సిటీజన్స్ కు జాతీయ సమైక్యతా పురస్కారాలు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కందుకూరి కృష్ణా రెడ్డి, సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ల చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ పురాణముల ప్రకారం ఉగాది వెనుక ఉన్న కథను వివరించారు.సృష్టి కర్త అయిన బ్రహ్మ ఉగాది రోజునే సృష్టి ప్రారంభించారట.ఆ నమ్మకం వల్లనే మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం ప్రారంభం అయిన రోజును ఉగాది అని పండుగ చేసుకుంటారన్నారు.జాతి ,మత,కుల,లింగ,ప్రాంత భేదాలు లేకుండా మనమంతా భారతీయులమనే భావజాలాన్ని కలిగి ఉండడమే జాతీయ సమైక్యత అని అన్నారు.అందుకే తమ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత కు కృషి చేస్తున్న హిందూ,ముస్లిం,క్రిస్టియన్ మతాలకు సంబంధించిన జిల్లాలోని పెన్షనర్స్,సీనియర్ సిటీజనన్లు ఎం.డి.యాకుబ్ , పి.హన్మంత్ రెడ్డి,బోబ్బాటి కరుణ, సింగం గంగాధర్,నారాయణ,పబ్బా శివానందం,ఒజ్జెల బుచ్చిరెడ్డి, అల్లూరి బాపురెడ్డి,జనార్దన్,రాజ్ మోహన్,బెనర్జీ, తదితర 16 మందికి జాతీయ సమైక్యతా పురస్కారాలను ఉగాది పండుగ సందర్భంగా అందజేశామన్నారు..క్రోధీ నామ సంవత్సరంలో ప్రజలు కోపంతో ఉంటారని,ప్రపంచంలో యుద్దాలు జరిగే అవకాశం ఉందని,రాష్ట్రాల మధ్య సఖ్యత తక్కువగా ఉంటుందని పంచాంగ్ పండితులు సూచిస్తున్నారన్నారు.కనుక ఆవేశంతో వ్యవహరించే ముందు కొంత ఆలోచన,సంయమనం పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, పెన్షనర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,అసోసియేట్ అధ్యక్షుడు పి.సి.హన్మంత్ రెడ్డి,సీనియర్ సిటీజేన్స్ కోశాధికారి వి.ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు ఎం.డి.యాకుబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి.ఆశోక్ రావు, కె.సత్యనారాయణ, రాజ్ గోపాల్ చారి,నాయకులు పి.సతీష్ రాజ్,సింగం గంగాధర్, బి.రాజేశ్వర్, ఉప్పుగళ్ల మురళీధర్,వేణుగోపాల్ రావు,కండ్లే గంగాధర్,పబ్బా శివానందం,రాజ్ మోహన్,సైఫోద్దీన్,చిలుక గంగారాం,కాలగిరి గంగ రెడ్డి,మధుసూదన్ రావు,ప్రసాద్,కిషన్,మనోహర్,దేవేందర్ రావు,నారాయణ, హన్మాండ్లు,జిల్లా,డివిజన్,వివిధ మండలాల పెన్షనర్స్,సీనియర్ సిటీజన్స్ తదితరులు పాల్గొన్నారు....
Srishailam Dudam Independent Journalist Jagtial Dist:9441271777 ది టార్గెట్ న్యూస్… …