06/12/2023
అంబేద్కర్ బాట అందరికీ ఆదర్శం...
విగ్రహాలు ఏర్పాటు కు శంఖుస్థాపన...
మండపేట:-అంబేద్కర్ బాట అందరికి ఆదర్శమని వైఎస్సార్సీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు లు పేర్కొన్నారు. మండపేట కరాచీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద బుధవారం అంబేడ్కర్ 67 వర్ధంతిని విగ్రహాల ఏర్పాటు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణ పాపారాయుడు లు చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ కొత్తపేట నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసారు. అనంతరం విగ్రహ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహాల ప్రతిష్టకు భూమి పూజ చేశారు. అనంతరం ఆ వార్డు కౌన్సిలర్ ముక్కా మేరీ స్వరూపరాణి సుబ్రహ్మణ్యంలకు ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ లు దుశ్శాలువాతో సత్కరించారు. తమ వార్డు పరిధిలో మహనీయుల విగ్రహాలు వెలుస్తున్నందుకు ఆనందంగా ఉందని సుబ్రహ్మణ్యం హర్షం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్లు వేగుళ్ల నారయ్యబాబు, పిల్లి గనేశ్వరరావు, దూలం వెంకన్నబాబు, తుపాకుల ప్రసన్న కుమార్, సాదే పిడుగు రాముడు, పట్టణ వైసీపీ కౌన్సిలర్లు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు మీగడ శ్రీనివాస్, షేక్ అలీఖాన్ బాబా తదితర నాయకులు శంఖుస్థాపన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ, పాపారాయుడు లు మాట్లాడుతూ ఇరువురు నాయకులు దేశ ప్రజలందరికీ ఆదర్శమన్నారు. వారిని కొన్ని వర్గాలకే పరిమితం చేశారన్నారు. వారు గుర్తుండి పోయేలా మండపేట మెయిన్ రోడ్డులో విగ్రహాలు నెలకొల్పాలని అనుకునే వారమన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చొరవతో మున్సిపల్ అధికార పార్టీ కౌన్సిల్ ద్వారా కార్యరూపం దాల్చిందన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే నాడు విగ్రహాల ప్రారంభోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. వైసీపీ నాయకులు చోడే శ్రీకృష్ణ, మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాస్, కౌన్సిలర్లు ముక్కా లోవలక్ష్మీ దాలయ్య, ముక్కా మేరీ స్వరూపారాణి సుబ్రహ్మణ్యం, పోతంశెట్టి వరప్రసాద్, చిట్టూరి సతీష్, ఎర్నేని ప్రభావతి, శెట్టి కళ్యాణి, నీలం దుర్గమ్మ, బొక్కా సరస్వతి, కొవ్వాడబేబీ అప్పన్నబాబు, అమలదాసు లక్ష్మి, గ్రంథి శ్రీనివాస్, మెండు బాపిరాజు, పిల్లి శ్రీనివాస్, వైసీపీ టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, ఎస్సీ నాయకులు, వైసీపీ నాయకులు పంపన శ్రీనివాస్, సిరంగు శ్రీనివాస్, టేకిముడి శ్రీనివాస్, జొన్నపల్లి సత్తిబాబు, ఉండ్రాజవరపు అర్జున్, పలివెల సుధాకర్, వల్లూరి రామకృష్ణ, బూర చిన్న, గుమ్మడి అనిల్ కుమార్, సాధనాల శివ, కనికెళ్ళ ప్రసాద్, మందపల్లి సంజీవ్ కుమార్, కొల్లి వరలక్ష్మి, కోనాల చంద్ర బోస్, పొలమాల సత్తిబాబు, పాలపర్తి సురేష్ , వారా సన్నీ, దండంగి చింటు, గునిపే శ్యామ్, బూరిగ జానీ, కొడమంచిలి భాస్కరరావు, మందపల్లి సుధాకర్, గనిపే నాగభూషణం, కొమ్ము సూరిబాబు, పేకేటి మాణిక్యం, తుపాకుల ప్రసన్న కుమార్, మల్లిపూడి శివ, పాలంకి కిషోర్, కప్పల అన్నవరం, కొల్లి చిన్నారావు, సన్మాల వెంకన్న,పాలపర్తి కన్నా, ముమ్మిడివరపు చిన్న, మసిపిలి రవి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.