Pushkarayatra

Pushkarayatra Godavari Pushkaram is a festival of River Godavari which occurs once in 12 years.
(1)

31/01/2024

ఇది అరుణాచలం వెళ్ళేవారికి ఉపయోగంగా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను...

అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని వివరాలు.

1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారో, అక్కడికి చేరుకోవడంతోనే, వారి గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది.

రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి, తిరిగి అక్కడికి చేరుకోవటంతో ఈ పరిక్రమణ పూర్తి అవుతుందనుకోవద్దు..

మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినా ఖచ్చితంగా, అక్కడ ఒక వినాయకుని గుడి ఉంటుంది...
అక్కడ, ఆ స్వామికి నమస్కరించి అక్కడినుంచి కూడా మొదలు పెట్టవచ్చు. అంటే, పరిక్రమణకు ముందుగా వినాయకుని దర్శనంతోనే ప్రారంభించాలి..

2. గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి. మనం గుడిలో ఎలా ప్రదక్షిణ చేస్తామో అలాగే చెయ్యాలి. కుడివైపున అరుణ గిరికి దగ్గరలో ఉండే కుడి మార్గం లో సూక్ష్మరూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు, గురువులు మొదలైన వారందరూ ప్రదక్షిణలు చేస్తారట! అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు.

3. అరుణాచలం వెళ్లే ప్రతి వారు ఖచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి.
ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు ఇస్తారు. ఆ విభూది పిల్లలు జడుసుకున్నప్పుడు, కార్యసిద్ధికి పనికివస్తుందని నమ్ముతారు.

4. దర్శనానికి గిరి ప్రదక్షిణకి వెళ్లేటప్పుడు రెండు చిన్నచిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి . ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు.

5. ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘంగా పనిచేస్తుందని చెబుతారు.

6. నైఋతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు కచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుందని చెబుతారు.
ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు.

7. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని, మధ్యలో గాని... ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు. భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు. ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది. ఆరోగ్యంకూడాను.

8. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరి ప్రదక్షణ చాలా ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటుంది. అది నా స్వానుభవం కూడానూ!!

9. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది.
వీలైనంతవరకూ, కూర్చోకుండా నిలబడి గానీ, తప్పనిసరి పరిస్థితుల్లో బెంచీపై పడుకునిగానీ, చిన్నగా విశ్రాంతి తీసుకుంటూ పరిక్రమణ చేయండి. కూర్చోవడం అంటూ మొదలు పెడితే, చాలా ఇబ్బందులు ఉంటాయి. కూర్చున్న చోటునుంచి లేవలేము.

10. కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని దర్శనానికి వెళ్లే వారు, అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అక్కడ మాత్రమే మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి, గోత్ర నామాలు చదివి, విభూతి ప్రసాదంగా ఇస్తారు.
కొబ్బరికాయ లేకపోతే, అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు.

11. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత
ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, దానిని
తప్పనిసరిగా దర్శనం చేసుకోండి.

12. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దపెద్ద స్తంభాలతో, అతి పెద్ద మండపం ఉంటుంది. ఆ మండపం పైకి వెళ్లి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది. రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేసారని చెబుతారు. దానిని దర్శించి, కొంచెంసేపు ఆ మంటపంలో జపమో, ధ్యానమో చేసుకుంటే చాలా బావుంటుంది.

13. రాజ గోపురానికి కుడి వైపున ఆనుకొని, ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది. అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు ఉండే బృందావనం.

14. ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం. ఆ మంటపం, గోపురం, మహా భక్తురాలైన అమ్మాణి అమ్మన్‌, అనే ఆవిడ కట్టించినట్లు చెబుతారు.

15. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతి పెద్ద కాలభైరవుని విగ్రహంతో ఆలయం ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి.

16. అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది. దాని క్రింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా చూసి రండి.

17. ఆ ప్రక్కనే ఉన్న దేవాలయంలో... ఉన్నామలై అమ్మన్ (అపితకుచలాంబ) అమ్మవారిని దర్శించుకుని, ఆ ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు. దక్షణ వేయని, వేయలేని వారికి ప్రక్కనే పళ్ళెంలో కుంకుమ ఉంచుతారు. బొట్టు పెట్టుకొని కొంచెం ఇంటికి కూడా తెచ్చుకోవచ్చును.

18. అగ్ని లింగానికి, రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం, ఆ విగ్రహం అత్యంత శక్తివంతమైనదని చెబుతారు.

అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఇది అగ్ని లింగం. కనుకనే ఎంత చలికాలంలో వెళ్లినా గర్భగుడిలో విగ్రహ పరిసరాలు, భూమి కూడా వేడిగా ఉంటాయి.

31/01/2024

*నైమిశారణ్యం*
*పురాణాల పుట్టిల్లు నైమిశారణ్యం. గురువులకు, తపస్వులకు నిలయం. వేదకాలం నుంచి నైమిశారణ్యంలో ఎప్పుడూ ఏవేవో దివ్య క్రతువులు, జ్ఞాన సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మూడులోకాలలోని తీర్థాలలో ఉత్తమమైనది నైమిశారణ్యం. ఈ దివ్య తీర్థాన్ని దర్శిస్తే సకల తీర్థాలనూ సేవించిన ఫలితం లభిస్తుంది.*

కురుక్షేత్రంలో ఒక క్రోసెడు దూరం నడిచినా, నైమిశారణ్యంలో ఒక అడుగు నడిచినా, యజ్ఞం చేసిన ఫలం లభిస్తుందని మహాభారతంలోని అరణ్యపర్వం చెబుతుంది. నైమిశారణ్యం ఎనిమిదో వైకుంఠం అని తులసీదాసు రామచరిత మానస్ చెబుతోంది.

1. దండకారణ్యం,
2. సైంధవారణ్యం,
3. జంబుకారణ్యం,
4. పుష్కరారణ్యం,
5. ఉత్పలారణ్యం,
6. బదరికారణ్యం,
7. జాంగలారణ్యం,
8. ఉత్తరారణ్యం,
9. నైమిశారణ్యం

అనే తొమ్మిది అరణ్యాలలో ఇది ఉత్తమమైనది.

*నైమిశం ఇలా పుట్టింది*

పాంచాల రాజ్యానికి, కోసల దేశానికి మధ్యలో 84 క్రోసులు అంటే 252 కి.మీ. దూరం వ్యాపించిన సువిశాల అరణ్యమే *"నైమిశారణ్యం.* అనాదికాలం నుంచి మన రుషులకు తపోస్థలి. శౌనకాది మహామునులు ఇక్కడ చిరకాలం తపస్సులు చేశారు. యజ్ఞయాగాలు నిర్వహించారు. ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి పుట్ట పవిత్రమైనవే.

పూర్వం కలియుగం ప్రారంభంలో రుషులు, మునులు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి, “స్వామీ! రాబోయే కలియుగం సకల అనర్థాలకూ మూలం కదా! మాకు కలిప్రభావం లేని ప్రదేశాన్ని సూచించండి. మేమంతా అక్కడికి వెళ్లి తపస్సు చేసుకుంటాం” అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సు ద్వారా ఒక దివ్యచక్రాన్ని సృష్టించి భూమిపైకి పంపాడు. “మహాత్ములారా! మీరంతా ఆ చక్రాన్ని అనుసరిస్తూ వెళ్లండి. ఆ చక్రం నేమి (ఇరుసు) ఎక్కడ ఆగుతుందో అదే మీరు కోరుకునే పుణ్యప్రదేశం" అని చెప్పి పంపించాడు. అలా బ్రహ్మ వదిలిన చక్రం ఇరుసు ఆగిన ప్రదేశమే *నైమిశారణ్యం.*

ఈ అరణ్యంలో శౌనక మహర్షి 84 వేలమంది మునులతో కలిసి భాగవత పారాయణ చేశాడని చెబుతారు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు కూడా ఇక్కడే ఒక యాగాన్ని చేసి మహాభారత పారాయణ చేశాడు. శ్రీరాముడు అశ్వమేధయాగం ఇక్కడే చేశాడు. ఇక్కడే లవకుశుల్ని కలుసుకున్నాడు.

*దర్శనీయ స్థలాలు:*

*చక్రతీర్థం:*

బ్రహ్మదేవుడి చక్రం ఆగిన స్థలంలోనే చక్రతీర్థం అనే పుష్కరిణి ఏర్పడింది. నైమిశారణ్యంలో ఇది సుప్రసిద్ధ తీర్థం. ఇది వృత్తాకారంగా అందంగా కనిపిస్తుంది. ఈ దివ్యతీర్థంలో స్నానం చేసినవారికి వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని ప్రతీతి. అమావాస్య, సోమవారం కలిసి వచ్చిన రోజున సోమావతీ అమావాస్య (జూలై 17) అంటారు. ఆ రోజున ఎవరైతే చక్రతీర్థంలో స్నానం చేస్తారో వారి మనోవాంఛలన్నీ తప్పకుండా సిద్ధిస్తాయి. అందుకే, ఈ పుణ్యతిథినాడు లక్షలాదిమంది నైమిశారణ్యానికి వచ్చి, చక్రతీర్థంలో స్నానాలు చేస్తారు. ఈ చక్రతీర్థమే భూమండలానికి మధ్యభాగం అని మహాభారతం శాంతిపర్వం (343.2) చెబుతోంది. ఈ తీర్థం పక్కనే ప్రాచీనమైన శివాలయం కూడా ఉంది. స్వామిపేరు *భూతేశ్వరుడు.*

*వ్యాసగద్దె :*

భగవాన్ వేదవ్యాస మహర్షి వేదవిభజన చేసిన ప్రదేశమే ఈ వ్యాసగద్దె. వ్యాసుడు ఇక్కడే ఒక్కటిగా ఉన్న వేదరాశిని నాలుగు వేదాలుగా విభాగం చేశాడంటారు♪. జైమిని, వైశంపాయనుడు, పైలుడు, అంగీరసుడు వంటి శిష్యులకు వేదవిద్యను ఇక్కడే ప్రబోధించాడు. అష్టాదశ పురాణాలను అందించాడు. ఈ వ్యాసగద్దెను చక్కటి పట్టువస్త్రంతో అలంకరిస్తారు. ఈ గద్దె పక్కనే వ్యాస, శుకమహర్షుల పాలరాతి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ వ్యాసగద్దె సమీపంలోనే మరికొన్ని మందిరాలు కూడా ఉన్నాయి. ఇది చక్రతీర్థానికి అరకిలోమీటరు దూరంలోనే ఉంది.

*సూతగద్దె :*

సూత పౌరాణికుడు ఎనభై ఎనిమిది వేలమంది మునులకు పురాణాలను వినిపించాడు. అంతేకాదు మన ఆంధ్రదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాన్ని మొదటిసారిగా సూతమహర్షి శౌనకాది మునులకు బోధించిన స్థలం కూడా ఇదే. ఈ ప్రదేశంలో సూతమహర్షి పాలరాతి విగ్రహాన్ని ఒక మందిరంలో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఒక పెద్ద దేవాలయంగా దీన్ని తీరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

*శౌనక యాగశాల:*

సూతగద్దె సమీపంలోనే పూర్వం శౌనకాది మహామునులు దీర్ఘసత్రయాగం చేసిన ప్రదేశం ఉంది. ఇక్కడ ఒక ప్రాచీనమైన యాగశాల మనకు కనిపిస్తుంది.

*లలితా శక్తిపీఠం:*

పవిత్రమైన నైమిశారణ్య క్షేత్రంలో సతీదేవి హృదయభాగం పడిందని చెబుతారు. దక్షయజ్ఞ వాటికలో ప్రాణాలు కోల్పోయిన సతీదేవి శరీరాన్ని శ్రీహరి తన చక్రంతో 108 భాగాలుగా ఖండించగా అవన్నీ భూమండలంలో 108 ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలుగా మారిపోయాయి. తంత్రగ్రంథాలలో ఈ పీఠాన్ని *ఉడ్డీయనీ పీఠం* అంటారు. నైమిశారణ్యంలో కొలువున్న అమ్మవారిని *లింగధారిణీ* అనే పేరుతో ఆరాధిస్తారు. అయితే లలితాపీఠంగా ఇది ప్రసిద్ధి చెందడం విశేషం. దసరా నవరాత్రులు, చైత్ర నవరాత్రుల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. చక్రతీర్థం నుంచి సుమారు ఒక కి.మీ. దూరంలో శక్తిపీఠం ఉంటుంది.

ఇంకా నైమిశారణ్యంలో బాలాజీ మందిరం, దేవరాజన్ మందిరం, గోమతీ నది, దధీచి కుండం, రుద్రావర్త కుండం హత్యారణ్య కుండం తప్పకుండా చూడవలసినవి.

*నైమిశారణ్య పరిక్రమ:*

తపోభూమి అయిన నైమిశారణ్యానికి ప్రదక్షిణ చేస్తే సకల పాపాలూ హరించి, మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రజల విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుక్ల పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు పదిహేనురోజుల పాటు 252 కి.మీ.ల దూరం వ్యాపించిన నైమిశారణ్యానికి పరిక్రమ చేస్తారు. ఈ పరిక్రమలో అనేకమంది పాల్గొంటారు. ప్రతి అమావాస్య నాడు సుమారు ఒక లక్షమంది, సోమావతీ అమావాస్య నాడు సుమారు 5 లక్షల మంది నైమిశారణ్యాన్ని సందర్శిస్తారని ఒక అంచనా.

*ప్రయాణ మార్గం:*

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి 100 కి.మీ. దూరంలో నైమిశారణ్యం ఉంది. ఇక్కడికి లక్నో నుంచి రోడ్డుమార్గంలో చేరుకోవచ్చు. ప్రయాణ సమయం సుమారు 2 గంటలు.

*వసతి సౌకర్యాలు:*

నైమిశారణ్యంలో అనేక మఠాలు, ఆశ్రమాలు వసతి సౌకర్యం అందిస్తున్నాయి. వాటితో పాటు లాడ్జిలు కూడా అందుబాటులో ఉన్నాయి. శ్రీబాలాజీ మందిరంలో నిత్యాన్నదాన సేవ నిర్వహిస్తున్నారు.

21/01/2024

#ద్రాక్షారామం చుట్టుపక్కల అనేక శివాలయాలు, దేవీ మందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే.

ఆ ఆలయాలన్నిటిని ఆకాశ మార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు.

విశేషమేమిటంటే., ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలలో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి, దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంది..

గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయదలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము లేదా జన్మ నక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు #ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట.

మేష రాశి నుండి మీన రాశి వరకు.. అదే క్రమంలో ఆరాధించవలసిన ఆలయాల సమాచారం..

1. #మేష_రాశి

మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాస గంగావరంలో వుంది.

అశ్విని_నక్షత్రం

పాదం ----------స్థలం -------- దేవీ దేవతల నామాలు...

1 వ పాదం... బ్రహ్మపురి.... శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి..
2 వ... ఉట్రుమిల్లి... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమశంకర స్వామి
3 వ... కుయ్యూరు... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
4 వ... దుగ్గుదూరు... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

భరణి_నక్షత్రం

1 వ... కోలంక... శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
2 వ... ఎంజారం... శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి
3 వ... పల్లిపాలెం... శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
4 వ... ఉప్పంగళ... శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి

కృత్తికా_నక్షత్రం

1 వ... నేలపల్లి... శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.

2. #వృషభ_రాశి

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభ రాశికి సంబంధించిన ఆలయం విలాస గంగావరంలో ఉన్నది.

కృత్తికా_నక్షత్రం

2 వ... అదంపల్లి... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
3 వ... వట్రపూడి... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
4 వ... ఉండూరు... శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి

రోహిణీ_నక్షత్రం

1 వ... తనుమల్ల... శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
2 వ... కాజులూరు... శ్రీ అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
3 వ... ఐతపూడి... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
4 వ... చీల... శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

మృగశిర_నక్షత్రం

1 వ... తాళ్ళరేవు... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
2 వ... గురజానపల్లి... శ్రీ ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి

3. #మిధున_రాశి

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిధున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాద్ లో ఉన్నది.

మృగశిర_నక్షత్రం

3 వ... అంద్రగ్గి... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
4 వ... జగన్నాధగిరి... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి

ఆరుద్ర_నక్షత్రం

1 వ... పనుమళ్ళ... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
2 వ... గొల్లపాలెం... శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి
3 వ... వేములవాడ... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి
4 వ... కూరాడ... శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి

పునర్వసు_నక్షత్రం

1 వ... గొర్రిపూడి (భీమలింగపాడు)....
శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి
2 వ... కరప... శ్రీ పర్వతవర్ధి సమేత శ్రీ రామ లింగేశ్వర స్వామి
3 వ... ఆరట్లకట్ల... శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లీశ్వర స్వామి

4. #కర్కాటక_రాశి

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.

పునర్వసు_నక్షత్రం

4 వ... యెనమాడల... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

పుష్యమి_నక్షత్రం

1 వ...కాపవరం... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
2 వ... సిరిపురం... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
3 వ... వేలంగి... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి
4 వ... ఓడూరు... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి

ఆశ్లేష_నక్షత్రం

1 వ... దోమాడ... శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి
2 వ... పెదపూడి... శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
3 వ... గండ్రాడు... శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
4 వ... మామిడాడ... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి

5. #సింహ_రాశి

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున సింహ రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.

మఖ_నక్షత్రం

1 వ... నరసరావుపేట... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
2 వ... మెల్లూరు... శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
3 వ... అరికిరేవుల... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
4 వ... కొత్తూరు... శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగ లింగేశ్వర స్వామి

పుబ్బ_నక్షత్రం

1 వ... చింతపల్లి... శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
2 వ... వెదురుపాక... శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
3 వ... తొస్సిపూడి... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ గోరేశ్వర స్వామి
4 వ... పొలమూరు... ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

ఉత్తర_నక్షత్రం

1 వ... పందలపాక... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

6. #కన్యా_రాశి

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యా రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం యూరుపల్లి లోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డది.

ఉత్తర_నక్షత్రం

2 వ... చోడవరం... శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్త్తేశ్వర స్వామి
3 వ... నదురుబాడు... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
4 వ... పసలపూడి... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ రాజరాజేశ్వరుడు

హస్త_నక్షత్రం

1 వ... సోమేశ్వరం... శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
2 వ... పడపర్తి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరుడు
3 వ... పులగుర్త... శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
4 వ... మాచవరం... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

చిత్త_నక్షత్రం

1 వ... కొప్పవరం.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
2 వ... అర్థమూరు.... శ్రీ పార్వతీ సమేతశ్రీ అగస్తేశ్వర స్వామి

7. #తుల_రాశి

ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపు పేట లో తులారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది.

చిత్త_నక్షత్రం

3 వ... చల్లూరు.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
4 వ... కాలేరు.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

స్వాతి_నక్షత్రం

1 వ... మారేడుబాక.... శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
2 వ... మండపేట.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి
3 వ... గుమ్మిలూరు.... శ్రీ ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
4 వ... వెంటూరు..... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

విశాఖ_నక్షత్రం

1 వ... దూళ్ళ.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
2 వ... నర్సిపూడి.... శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి
3 వ... నవాబుపేట... శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి

8. #వృశ్చిక_రాశి

ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపు పేట లో వృశ్చిక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి అంకితం.

విశాఖ_నక్షత్రం

4 వ... కూర్మపురం.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

అనూరాధ_నక్షత్రం

1 వ... పనికేరు.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి
2 వ... చింతలూరు.... శ్రీ పార్వతీ సమేత శ్రీ పృధ్వీశ్వర స్వామి
3 వ... పినపల్ల.... శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
4 వ... పెదపల్ల.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

జ్యేష్ట_నక్షత్రం

1 వ... వడ్లమూరు..... శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
2 వ... నల్లూరు.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
3 వ... వెదురుమూడి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
4 వ... తేకి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

9. #ధనుస్సు_రాశి

ధనుస్సు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైఋతిలో ఉన్నది. నేలపర్తిపాడు లోని శ్రీ అన్నపూర్ణా సమేత కాశి విశ్వేశ్వర స్వామికి అంకితం...

మూల_నక్షత్రం

1 వ.... యెండగండి.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
2 వ.... పామర్రు.... శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
3 వ... అముజూరు.... శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
4 వ... పానంగిపల్లి..... శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి

పూర్వాషాఢ_నక్షత్రం

1 వ... అంగర... శ్రీ పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామి
2 వ.... కోరుమిళ్ళ..... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
3 వ... కుళ్ళ.... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
4 వ.... వాకతిప్ప..... శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి

ఉత్తరాషాఢ_నక్షత్రం

1 వ.... తాతపూడి.... శ్రీ పార్వతీసమేత శ్రీ మల్లేశ్వర స్వామి

10. ాశి

మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువు లోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.

ఉత్తరాషాడ_నక్షత్రం

2 వ___ మచర___ శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
3 వ___ సత్యవాడ____ శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
4 వ___ సుందరపల్లి____ శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి

శ్రవణ_నక్షత్రం

1 వ___ వానపల్లి...... శ్రీ ఉమాసమేత శ్రీ వైద్యనాధీశ్వర స్వామి
2 వ....మాదిపల్లి (మాడుపల్లి)__ శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
3 వ.... వాడపాలెం..... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామి
4 వ.... వీరపల్లిపాలెం.... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

ధనిష్ట_నక్షత్రం

1 వ.... వెల్వలపల్లి... శ్రీ మహిషాసురమర్ధనీ సమేత శ్రీ రాజరాజనరేంద్ర స్వామి
2 వ... అయినవెల్లి..... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

11. #కుంభ_రాశి

కుంభ రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణంలో ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.

ధనిష్ట_నక్షత్రం

3 వ..... మసకపల్లి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి
4 వ... కుందూరు.... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

శతభష_నక్షత్రం

1 వ.... కోటిపల్లి___ శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
2 వ... కోటిపల్లి____ శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి
3 వ.... తొట్టరమూడి..... శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మూల్లేశ్వర స్వామి
4 వ___ పాతకోట.... శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

పూర్వాభాద్ర_నక్షత్రం
1 వ.... ముక్తేశ్వరం.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
2 వ.... శాసనపల్లి లంక..... శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశ్రీ చౌడేశ్వర స్వామి
3 వ... తానెలంక..... శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి

12. #మీన_రాశి

మీనరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈఆలయం.

పూర్వాభాద్ర_నక్షత్రం

4 వ.... ఎర్రపోతవరం.... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి

ఉత్తరాభాద్ర_నక్షత్రం

1 వ.... డంగేరు..... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
2 వ.... కుడుపూరు..... శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
3 వ..... గుడిగళ్ళ____ శ్రీ ఉమాదేవీ సమేత శ్రీ మార్కండేయ స్వామి
4 వ.... శివల___ శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ త్రిపురాంతక స్వామి

రేవతి_నక్షత్రం

1 వ... భట్లపాలిక..... శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
2 వ.... కాపులపాలెం..... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి
3 వ... పేకేరు...... శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
4 వ..... బాలాంత్రం..... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి..

ఓం నమఃశివాయ... హరహర మహాదేవ...

13/12/2023

మిత్రులారా! కాశీలోని విశ్వేశ్వరుడికి సప్త ఋషి పూజా హారతి జరుగుతోంది. అరుదుగా కనిపించే దృశ్యం. చూసి ఆనందించండి

13/12/2023

*పోలి స్వర్గం నోము – ప్రాశస్త్యం , పోలిస్వర్గం కధ*

స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలి స్వర్గం నోము. ప్రాచీనకాలం నుంచి కార్తీకమాసంలో స్త్రీలు అందరిని ప్రభావితం చేసే నోములలో పోలిస్వర్గం నోము ఒకటి.

ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకూ ప్రాతః కాలమేలేచి నదీ స్నానం చేసి దీపములను వెలిగించలేనివారు, ఈ పోలి స్వర్గం నాడు తెల్లవాఝామునే లేచి నదిలో స్నానమాచరించి అరటిదొప్పలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన యెడల కార్తీకమాసం అంతా తెల్లవాఝామున నదీస్నానమాచరించిన ఫలితము, దీపములు వెలిగించిన ఫలితములు కలుగును.

*పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి (పోలి పాడ్యమి)రోజున వెలిగించుకోవాలి.*

స్త్రీలందరూ ఈ రోజున కలసికట్టుగా నదీస్నానం చేసి, నదిఒడ్డునే దీపములను వెలిగించి, నోమును ఆచరించి, బ్రాహ్మణోత్తమునలకు స్వయంపాకములు, దీపదానములు ఇచ్చి ఆశీర్వాదములు పొందుతారు. కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం.

పొలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్ళే వృత్తాంతమే పోలిస్వర్గం నోము కధ.

పోలి స్వర్గం నోము కధ:
ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ అయిదుగు కోడళ్లలో చివరిది … చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూవులు కోయడం … పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకూ దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పూవులు కోయడానికి … పూజలు చేయడానికి … అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త.సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా వుంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహా భక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకచేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున వుంచి, మిగతా కోడళ్ళను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది.ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి, ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్లింది. పోలి ఏ మాత్రం బాధపడకుండా, బావి దగ్గరే స్నానం చేసి … పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి వున్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది.ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త, తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది.

ఆ వెంటనే మిగతా కోడళ్లు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు … కార్తీక అమావాస్య వరకూ ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది.

11/11/2023

తిరుమలలో శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసా ! తిరుమలలో శంఖనిధి,పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ముందు వారు ఎవరో ముందు తెలుసుకుందాం.శంఖనిధి,పద్మనిధులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షినదిక్కున ఉన్న రక్షకదేవత పేరు శంఖనిధి,ఇలాగే కుడిప్రక్కన అంటే ఉత్తరదిక్కున ఉన్న రక్షకదేవత పేరు పద్మనిధి . శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించివుంటాడు. పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి. ఇంతకూ వీరు ఎక్కడ ఉన్నారంటారా!

తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహవిగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోనికి ప్రవేశించేముందు మనం మనకాళ్ళను ప్రక్షాళనచేసుకునే దగ్గర శ్రీవారి ఆలయంగడపకు ఇరుప్రక్కలా కనిపిస్తారు. మనం సాధారణంగా కాళ్ళను కడుక్కునే ఆలోచనలో ఉంటాము.కాబట్టి వారిని గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది.దానికి తోడు ఎంతోసేపు ఎదురుచూసిన ఆలయప్రవేశం ఆనందంలో కూడా గమనించం. ఈ నిధిదేవతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణంగల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించవచ్చు. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుతదేవరాయలది. బహుశా అచ్యుతరాయలే ఈ నిధిదేవతలను ప్రతిష్టించి ఉంటాడనవచ్చు. ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారంవద్ద ఏర్పాటు చెయ్యడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడుప్రాకారాలు కలిగిన ఆలయమని తెలుస్తోంది. ఇంతకు ముందు వీరిని మీరు గమనించివుండకపోతే ఈసారి శ్రీవారిదర్శనంకు వెళ్ళినప్పుడు గమనించి నమస్కరించి ఆలయంలో ప్రవేశించండి.

04/11/2023
04/11/2023

అయిగిరి నందిని నందిత మేదిని…. విశ్వ వినోదిని నందనుతే…
గిరివర వింధ్య శిరోధిని వాసిని… విష్ణు విలాసిని జిష్ణునుతే…
భగవతి హేశితి కంఠ కుటుంబిని… భూరి కుటుంబిని భూరికృతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…
సురవర వర్షిణి దుర్దర ధర్షిణి దుర్ముఖ మర్షిణి హర్షరతే….
త్రిభువన పోషిణి శంకరతోషిణి… కిల్బిషమోషిణి ఘోషరతే…
దనుజనిరోషిణి దితిసుతరోషిణి… దుర్మదశోషిణి సింధుసుతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

అయి జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణి తుంగహిమాలయ… శృంగ నిజాలయ మధ్యగతే…
మధుమధురే మధుకైటభగంజిని… కైటభభంజిని రాసరతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

అయిశతఖండ విఖండితరుండ… వితుండిత శుండ గజాధిపతే…
రిపుగజగండ విదారణ చండ… పరాక్రమ శుండ మృగాధిపతే…
నిజభుజదండ నిపాతిత ఖండ… విపాతితముండ భటాధిపతే…
జయ జయ హే మహిషాసుర మర్దిని… రమ్యకపర్దిని శైలసుతే…

31/10/2023

1000కేజీల అన్నం 500కేజీల కూరగాయలతొ తంజావూరు బృహదీశ్వరాలయలొ అన్నాభిషేకం మరియు అలంకరణ..

Address

20-327, Dinakar Nagar
Secunderabad
500015

Alerts

Be the first to know and let us send you an email when Pushkarayatra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category


Other Travel Agencies in Secunderabad

Show All