Bangcok Tour

Bangcok Tour Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bangcok Tour, Tour Agency, Tenali.

01/01/2024

🎊💦🦚🌹🌈💦🎊

💐 ☝ *మిత్రమా*

🙏కాలం ఎప్పుడూ ఖాళీ పత్రమే ...
మంచో చెడ్డో నువ్వే రాయాలి !
సంవత్సరమనేది ఒక సంకేతం మాత్రమే ...
*సాధనా, శోధనా నీదే అవ్వాలి !!*
ఉత్సవాలూ ఉత్సాహాలూ
మనలో ఎగసిపడే అనుభూతి ప్రవాహాలే ...
తెల్లారితే నెమ్మదించే తేటగీతి పద్యాలే !!

మన మూలాలు, వాస్తవాలు
మళ్ళీ నిన్నటి నుంచీ, నేల నుంచే మొదలవుతాయి ...
మన పరిమితులు, పరిస్థితులు
నిన్ను నీ నుంచే ఆరంభం కమ్మంటాయి ...

నిన్న నువ్వు దిద్దిందే రేపటి రూపం ...
నేడు నువ్వు నడిచిందే రేపు చేరే గమ్యం ..
*తన జీవితం అయిపోయిందనుకునే లోపలే*

*" గొంగళి పురుగు " అందమైన " సీతాకోక చిలుక " లా మారి పైకి ఎగురుతుంది.....!*
*i .....అలాగే....!*
*మనిషి జీవితం కూడా అంతే " కష్టం " వచ్చినప్పుడు " ఓర్పుగా " ఉంటే " కొత్త జీవితం ప్రారంభం " అవుతుంది....!!*

ఇప్పటి నుంచే,
మార్పుకోసం ప్రయత్నిద్దాం !

*నిమిషం మారవచ్చు, గంటలు,రోజులు, మాసాలు, సంవత్సరాలు మారవచ్చు*.
*కానీ మనం చేసిన మంచి చెడూ మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది మంచి పని శాశ్వతంగా మనల్ని కాపాడుతూనే ఉంటుంది!*

*365 రోజులు*
*365 అవకాశాలు*

*మన కలల్ని సాకారం చేసుకుందాం!*
*ప్రపంచమంతా సుఖ శాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షిద్దాం* !!🙏

💐:: *మిత్రులు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు* ::💐

మీ
మురళీమోహన్
ఓం శ్రీ లక్ష్మీ జ్యుయలెర్స్
ఓం శ్రీ హాలిడేస్
9440915570

🎊💦🦚🌹🌈💦🎊

19/12/2023

*🙏దివ్య దక్షిణ భారత యాత్ర🙏*

ప్రపంచం లోనే మొట్ట మొదటి గ్రానైట్ తో నిర్మించిన దేవాలయం
మన దక్షణ భారత దేశం లోనే ఉంది ..
అలాంటి గొప్ప దేవాలయం ను సందర్శించే అవకాశం
మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటు లోకి తెచ్చింది మన రైల్వే శాఖ.
దివ్య దక్షణ భారత యాత్ర పేరుతో
23 January , 2024 వ తేదీ నాడు
సికిందరాబాదు నుండి ప్రత్యేక భారత్ గౌరవ్ యాత్ర స్పెషల్ రైలు బయలుదేరుతుంది.
ఈ రైలు సికిందరాబాద్ నుండి , కాజీపేట , వరంగల్ ,ఖమ్మం , విజయవాడ , తెనాలి , ఒంగోలు , గూడూరు , రేణిగుంట స్టేషన్ ల లో ఆగుతూ ప్రయాణం చేస్తుంది .
ఈ స్పెషల్ ట్రైన్ లో ప్రత్యేకత లు ఏమిటంటే ..
ప్రయాణికులకు :
భోజనం ( ఉదయం టిఫిన్ , లంచ్ , డిన్నర్ ల తో పాటు ప్రతిరోజూ ఒక వాటర్ బాటిల్ )
ట్రైన్ లో రిజర్వేషన్ ,
దేవాలయాల వద్దకు రోడ్ రవాణా ,
గైడ్ సౌకర్యం ,
సెక్యూరిటీ ,
మొదలగు అన్నీ సదుపాయాలు కల్పిస్తుంది .
తంజావూరు తో పాటు
అరుణాచలం
త్రివేండ్రం
రామేశ్వరం ( రాత్రి విడిది )
కన్యాకుమారి ( రాత్రి విడిది)
తిరుచ్చి
మధురై ప్రాంతాలను సందర్శించ వచ్చు .
ధరలు మనిషికి : 2nd A/C : రూ. 27,900/-
3rd A/C మనిషికి : రూ. 21,500/-
స్లీపర్ ( నాన్ ఏ.సీ )మనిషికి : రూ . 14,500/- అన్నీ పన్నుల తో కలిపి .
ప్రయాణికులు సందర్శించే ఒక గొప్ప ప్రాంతం అయిన
బృహదీశ్వరాలయం గూర్చి ఇప్పుడు తెలుసు కొందాం....
బృహదీశ్వరాలయంలో దాగి ఉన్న రహస్యాలు..ఎంటో తెలుసా ?
భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో పదకొండవ పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రంలో తంజావూరులో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు, పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీపై తంజావూరు ఉంది. చరిత్ర కారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది.
అంతే కాదు తంజావూరులో ఎంతో ప్రాచీనమైన ఆలయాలలో బృహదీశ్వర ఆలయం ఎంతో ముఖ్యమైనది. ఇది హిందూ దేవాలయాల్లో ఎంతో ప్రాచీనమైన దేవాలయం. ఇది ఒక శివాలయం దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారని చరిత్ర చెపుతుంది. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడిందని చెపుతుంటారు. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా ఈ దేవాలయాన్ని పరిగణింపబడుచున్నది.
ఆలయ చరిత్ర రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతను తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ.
అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.
ఆలయ నిర్మాణము..
ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు, వాస్తుశిల్పి చే చేయబడింది. ఈ విషయములు ఆ ప్రాంతంలో గల శాసనాల ద్వారా తెలుకోవచ్చు. ఈ దేవాలయం వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఆలయ విగ్రహాలు ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉంటాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమానం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవిగా చెపుతుంటారు.
ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు..
వేయి సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయంగా ఈ ఆలయం చెప్పబడుతుంది. ఈ ఆలయానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉందని చెపుతుంటారు. ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి. 13 అంతస్థులతో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. ఈ ఆలయం నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది.
మరి ఇక ఆలస్యం ఎందుకు .. నేడే మీ టిక్కెట్స్ ను బుక్ చేసుకోండీ

*టిక్కెట్స్ కోసం*
మురళీ మోహన్
ఓ3మ్ శ్రీ హాలిడేస్
9440915570

01/03/2023

Address

Tenali
522201

Telephone

+919440915570

Website

Alerts

Be the first to know and let us send you an email when Bangcok Tour posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category

Nearby travel agencies


Other Tour Agencies in Tenali

Show All