22/04/2024
డాక్టర్ మణి భూషణ్ సేవలకు ఉగాది పురస్కారంతో ఘన సన్మానం
================================================
నగరానికి చెందిన ప్రముఖ స్వచ్చంద సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ మరియు జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ దర్శకుడు డాక్టర్ మణి భూషణ్ గారికి వాసవి స్వయం సేవ ట్రస్ట్ , అనకాపల్లి వారు స్థానిక పాలూరు చిదంబరం హల్ నందు నిర్వహించిన ఉగాది సంబరాల ఆత్మీయ సమ్మేళనం లో " ఉగాది పురస్కార 2024 " విభిన్న పర్యాటక సాంకేతిక సమాచార రంగం లో వారు చేస్తున్న అజరామర సేవలను గుర్తించి ప్రముఖల చేతులమీదుగా ఘన సన్మానం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ అతిధి వేద పండితులు శ్రీ మావుళ్ళపల్లి సత్యనారాయణ శర్మ గారు మాట్లాడుతూ సేవ అనేది నిస్వార్ధంగా చేసేది అలంటి ఎంతోమంది సేవ ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి , ప్రతిఒక్కరు తమ వంతు సేవలు చేస్తూ సమాజాభివృద్ధికి దోహదపడుతున్నారు అలాంటి వారి లో డాక్టర్ మణి భూషణ్ గారు చేస్తున్న సేవలు చాల గొప్పవి ఎంతోమందికి కంప్యూటర్ విద్యనందించి వారి భవిష్యత్తుకు దారి చూపిస్తున్న మార్గదర్శి అని కొనియాడారు . మరో విశిష్ట అతిధి జ్యోతిష్య రత్న భూషణ డాక్టర్ నారాయణ పట్నాయక్ గారు మాట్లాడుతూ మరుగున పడిన ఎంతో మంది సేవలు గుర్తించి ప్రపంచానికి పరిచయం చెయ్యడం లో డాక్టర్ మణి భూషణ్ అనుసరిస్తున్న సాంకేతికత ఎంతోమంది సేవ తత్పరులను ఒకే వేదిక పై నిలబెడుతున్నది, ఎన్నో అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సేవ అభినందనీయం అని తెలిపారు . వాసవి స్వయం సేవ ట్రస్ట్ చైర్మన్ బత్తుల గణపతి గారు మాట్లాడుతూ , సేవ అనేది వంశపారంపర్యంగా వారి రక్తం లో నిండివుంది , వారి తల్లిదండ్రులనుండి స్ఫూర్తి పొంది సమాజం కోసం నేను అని పాటుపడుతు, ఎన్నో చైతన్యవంతమైన చిత్రాలు ద్వారా ప్రపంచ పర్యాటకుల మన్ననలు పొంది , విశాఖ పర్యాటక రంగ అభివృద్ధి లో ప్రధాన పాత్రపోషిస్తు , పర్యావరణం , భాష ,సంస్కృతి , చరిత్ర , కళ, సంగీతం ,నృత్యం , ప్రకృతి పరిరక్షణ , జంతు సంరక్షణ , రహదారి భద్రతా , వ్యవసాయం వంటి ఎన్నో రంగాల్లో సేవలు అందిస్తున్న డాక్టర్ మణి భూషణ్ అందరికి ఆదర్శప్రాయుడు వారిని గౌరవించుకోవడం మన భాద్యత , వారి సేవలు నిరంతరం ఇలాగె కొనసాగాలని ఈ పురస్కారం వారికీ నూతన ఉత్తేజం కలిగిస్తుందని ఆసిస్తూ వేదపండితుల ఆశీర్వచనమ్ తో వారికీ ఈ ఉగాది కొత్త వెలుగులు నింపాలని శుభాకాంక్షలు తెలిపారు .
ఈ కార్యక్రమం లో పలువురు సంఘ సేవకులు అవార్డులు అందుకున్నారు . ఎడిటర్ నీరజ మరియు సంస్థ సభ్యులు , ప్రజలు హాజరయ్యారు.
ఇట్లు
విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్
విశాఖపట్నం.
9848418582