02/05/2024
*ఆంధ్రప్రదేశ్*
*ఏపీలో ఏ వర్గానికి ఎన్ని ఓట్లు* - *ఎవరి మద్దతెవరికి, అక్కడే గెలుపు*..!!
ఏపీలో ఈ సారి ఎన్నికల సమరంలో సామాజిక లెక్కలు కీలకం అవుతున్నాయి. సామాజిక లెక్కల ఆధారంగానే అభ్యర్దుల ఎంపిక నుంచి ఎలక్షన్ రింగ్ వరకు పార్టీలు ప్రణాళికలు సిద్దం చేసాయి.
*ప్రతీ నియోజకవర్గంలో ఈ లెక్కలే అభ్యర్దుల గెలుపు ఓటమలను డిసైడ్ చేయనున్నాయి*.
వర్గాల వారీగా పార్టీలు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తమ ఓట్ బ్యాంక్ పై లెక్కలు వేస్తున్నాయి. దీంతో, ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి..ఎవరి మద్దతు ఏ పార్టీకి ఉందనేది కీలకంగా మారుతోంది.
*ఎవరి ఓట్లు ఎన్ని*
ఏపీలో సామాజిక వర్గాల వారీగా పార్టీల వద్ద లెక్కల ఆధారంగా కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో కాపులు, బలిజలు: 52,07,091, ఎస్సీ మాల: 35,46,748, రెడ్డి: 31,69,029, మాదిగ: 15,85,725.,
యాదవ: 26,54,037, ముస్లిం: 23,84,492, కమ్మ: 29,87,911, ఉత్తరాంధ్ర కాపులు: 15,18,044. వైశ్యులు: 13,41,478, బోయ వాల్మీకి: 9,69,868, మత్స్య కారులు: 15,74,865, కొప్పుల వెలమ: 9,65,814, పద్మ శాలీలు:
9,24,351, గౌడ: 19,78,826, రజకులు: 8,41,457, బ్రాహ్మణ: 7,41,655, వడ్డెర్లు: 5,54,657, నాయీ బ్రాహ్మణులు: 4,15,520, క్షత్రియులు: 4,12,579, కలింగులు:3,57,070 ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో. పార్టీలు ఎక్కడ ఏ వర్గం ప్రాబల్యం ఉందో అక్కడ తమకు అనుకూలంగా పరిస్థితులు మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.
*తయారు చేసినది* :
*నవీన్ రెడ్డి తోటరెడ్డి*
అంతర్జాలం ఆధారంగా....